American woman : చేయని నేరానికి 40 ఏళ్లు జైల్లో.. టైం బాగాలేకపోతే అంతే!

American woman ఏది ఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.

Written By: NARESH, Updated On : June 19, 2024 10:31 pm

40 years in prison American woman Sandra Hemme

Follow us on

American woman : మనం ఎంత నిజాయతీగా పనిచేసినా.. ఎలాంటి పొరపాటు చేయకపోయినా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని చూసినా.. దానికి గుర్తింపు రావాలంటే మన టైం బాగుండాలి. అది బాగలేకపోతే సాయానికి గుర్తింపు లేకపోగా.. మనమే తప్పు చేశామన్న అపవాదును కూడా మూటగట్టుకోవాల్సి ఉంటుంది. చేయని నేరానికి శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి బాధనే అనుభవించింది అమెరికాకు చెందిన ఓ మహిళ. చేయని నేరానికి ఒకటి కాదు రెండు కాదు.. 40 ఏళ్లు జైల్లో మగ్గింది.

ఏం జరిగిందంటే..
సాండ్రా హెమ్మె అనే 64 ఏళ్ల మిస్సౌరీ మాజీ పోలీస్‌ అధికారి. తన సహ పోలీసు అధికారి జెష్కేని హత్య చేసిన కేసులో 40 ఏళ్లకుపైగానే జైల్లో గడిపింది. అంతేకాదు అమెరికా చరిత్రలోనే ఎక్కువకాలం తప్పుగా ఖైదు చేయబడిన మహిళగా నిలిచింది. కేవలం వాగ్మూలం ఆధారంగా కోర్టు శిక్షించడం.. దీనిపై ఆమె సుదీర్ఘకాలంగా చేసిన న్యాయ పోరాటం ఫలించింది. చివరకు విడుదలైంది.

మానసిక వ్యాధితో..
నిజానికి అప్పటికే హెమ్మె మానసిక వ్యాధితో బాధపడుతోంది. అందుకు తగిన మందులు వాడుతున్నారు. ఈ సమయంలో కోర్టులో ప్రవేశపెట్టగా అస్పష్టమైన సమాధానాలు చెప్పడంతో కోర్టు వాటిని బేస్‌ చేసుకుంది. ట్విస్ట్‌ ఏమిటంటే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు, కొన్ని భౌతిక సాక్షాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అలాగే హెమ్మె ఇచ్చిన సమాధానాల్లో నేరానికి లింక్‌ అప్‌ అయ్యేలా ఎలాంటి సమాధానాలు కూడా ఇవ్వలేదని బాధిత తరఫు న్యాయవాది హార్స్‌మన్‌ పేర్కొన్నారు. కోర్టు మాత్రం ఆమె వాగ్మూలాన్నే ప్రధానంగా తీసుకుని ఇంతలా శిక్ష విధించడం అమానుషమని వాదించారు.

ఇన్నోసెన్స్‌ ప్రాజెక్టు కూడా..
న్యూయార్క్‌లో ఉన్న ఇన్నోసెన్స్ ప్రాజెక్టు హెమ్మె కేసును స్వీకరించి ఆమెకు న్యాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన పోలీసులు హెమ్మెని ఈ కేసులో ఇరికించేలా సాక్ష్యాధారాలను సృష్టించారని ఆరోపించారు. ఇన్నోసెన్స్‌ చేసిన దర్యాప్తులో హత్య జరిగిన తర్వాత రోజే తన సహ పోలీసు అధికారి క్రెడిట్‌ కార్డుని హెమ్మె ఉపయోగించిందని అలాగే ఆమె ట్రక్‌ చనిపోయిన బాధితురాలి ఇంటి వద్ద పార్క్‌ చేసి ఉందని పిటిీషన్‌లో పోలీసులు చెప్పారు. అలాగే ఆ ప్రదేశంలోనే బాధితురాలి చెవి పోగులు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఇవేమీ క్లియర్‌గా హెమ్మెనే ఈ హత్య చేసిందనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు కావు.

హత్య తర్వాత కూడా నేరాలు..
ఇక బాధితురాలు పోలీసు అధికారి జెష్కే హత్యకు ముందు తర్వాత కూడా అలాంటి నేరాలు మహిళలపై చాలా జరిగాయి. దీంతో ఈ నేరం హెమ్మె చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీంతో కోర్టు హెమ్మెను నిర్దోషిగా ప్రకటించింది. ఏది ఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.