Homeఅంతర్జాతీయంTANA Women's Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s Day : ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ వెస్ట్ చెస్టర్ నగరంలో శనివారం (మార్చి 11)న మిడ్ అట్లాంటిక్ తానా టీం ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 600 మందికి పైగా ఫిలడెల్ఫియా‌ మరియు సౌత్ జెర్సీ పరిధిలో నివాసముంటున్న ఎందరో ప్రవాస తెలుగింటి ఆడపడుచులు, ఈ వేడుకకు హాజరై ఆటపాటలతో, నృత్య ప్రదర్శనలతో, ఫ్యాషన్ షోలతో ఉత్యాహంతో సందడి చేసారు. ఇందులో తెలుగు మహిళలు సాధిస్తున్న విజయాలకు గుర్తుగా ఆటపాటలతో అలరించారు. నృత్య ప్రదర్శన,ఫ్యాషన్ షోలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు అతిథులతో వేడుక అట్టహాసంగా మారింది. కార్యక్రమం శోభాయమానంగా తయారయింది.

ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు. తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఆర్ధిక, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాలలో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారు అని ప్రసంగిస్తూ “మహిళలు మీకు జోహార్లు” అని వందనం చేసారు. జులై 7 నుండి 9 వరకు జరగబోయే 23వ తానా మహాసభలలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలు అని కొనియాడారు.

ఈ సందర్భంగా, ఇంతమంది ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరెత్తించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందంటూ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసారు. రస్నా బేబీ, సింహాద్రి ఫేమ్ చిత్ర కధానాయిక అంకిత ఝవేరి రాకతో వేడుక మరింత శోభాయమానంగా మారింది.

ఈ కార్యక్రమంలో తానా విమెన్ కోఆర్డినేటర్ శ్రీమతి ఉమా కటికి ప్రసంగం మహిళలందరిలోను స్ఫూర్తినింపేలాగా సాగింది. తాను ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్గ అందించిన సేవలు, గృహహింసకు లోనైనా మహిళలకు, వరకట్న వేధింపులకు గురైన మగువలకు తానూ ఆసరాగా నిలిచినిన పలు సందర్భాలు నెమరేసుకున్నారు.

వైద్య రంగంలో అత్యున్నత సేవలందిస్తునందుకు గాను ప్రముఖ వైద్యురాలు డా. శైలజ ముసునూరు, డా. ప్రమీల మోటుపల్లి, డాక్టర్ ప్రశాంతి బొబ్బా, స్వర్ణ జెవెలర్స్ శ్రీమతి అలివేలు రాచమడుగు మరియు మిస్ ఇండియా డెలావేర్ శ్వేతా కొమ్మోజిని ఘనంగా సత్కరించారు.

ధీర వనితలు: మిడ్ అట్లాంటిక్ మహిళా కోఆర్డినేటర్ సరోజ పావులూరి, భవాని క్రొత్తపల్లి, లక్ష్మి ముద్దన, మనీషా మేక, రాజేశ్వరి కొడాలి, భవాని మామిడి, దీప్తి కొక, రమ్య పావులూరి, లక్ష్మి కసుకుర్తి, మైత్రి నడింపల్లి, ఇందు పొట్లూరి, రూప ముద్దన, హిమబిందు కోడూరు, రాణి తుమ్మల, స్మిత తదితరులు కార్యక్రమ విజయానికి కృషి చేసారు.

ఈ కార్యక్రమంలో తానా 23వ మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, మిడ్ అట్లాంటిక్ ప్రాంత ప్రతినిధి సునీల్ కోగంటి, తానా ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, తానా టీం స్క్వేర్ కో చైర్ కిరణ్ కొత్తపల్లి, రంజిత్ మామిడి, చలం పావులూరి, ఫణి కంతేటి, ప్రసాద్ క్రొత్తపల్లి, విశ్వనాథ్ కోగంటి, రామ ముద్దాన, రవి తేజ ముత్తు, కృష్ణ నందమూరి, కోటి బాబు యాగంటి, సాంబయ్య కోటపాటి, గోపి వాగ్వాల, సతీష్ మేక, సతీష్ చుండ్రు, వెంకట్ సింగు, మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, హర్రీస్ బర్గ్ తానా టీం, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గున్నారు.

పసందైన విందు స్పాన్సర్ చేసినందుకు గాను డెక్కన్ స్పైస్ వారికీ, రుచికరమైన చిక్కని కాఫీ స్పాన్సర్ చేసినందుకు గాను భూమి కాఫీ ప్రొప్రైటర్ పాపారావు ఉండవల్లి గారికి, స్వర్ణ జెవెల్స్ వారికీ, లక్ష్మి మోపర్తి గారికి, వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీ లక్ష్మి కులకర్ణి గారికి, మాన్విత యాగంటి, వ్యోం క్రొత్తపల్లికు, కార్యక్రమం జయప్రదం చేసిన నారీమణులకు, వాలంటీర్లకు ఫిలడెల్ఫియా తానా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఒక తల్లిగా, తోబుట్టువుగా, బిడ్డగా, భార్యగా రకరకాల అవతారాలలో మగవారి జీవితానికి ఒక అర్ధం పరమార్ధం తెచ్చే మహిళామూర్తులందరికి పాదాభివందనం అని ప్రసంగించారు.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను గౌరవించారు. వారికి సన్మానాలు చేశారు. ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేశారు. సమాజంలో వారి బాధ్యతలను గుర్తు చేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version