CAA Mother’s Day తల్లి ప్రేమ నిస్వార్థమైనది, నిరంతరమైనది. ఆ ప్రేమకు మనం ఏమి ఇచ్చినా, ఏమి చేసినా ఋణం తీర్చుకోలేం. ఏమీ ఆశించకుండా, ప్రతినిత్యం తన బిడ్డల కోసం తపనపడుతూ, ఏ త్యాగానికీ వెనుకాడని మాతృమూర్తులకు పదిజన్మలు ఎత్తి సేవ చేసినా ఋణం తీర్చుకోలేం. అంతటి గొప్ప మాతృ ప్రేమను అందించే.. మాతృమూర్తులను గౌరవించాలనే సదుద్దేశంతో ‘మదర్స్ డే వేడుకలను’ చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు ఒక వినూత్నమైన పద్ధతిలో నిర్వహించారు. మే 11న, నేపర్‌విల్లేలోని వాలన్ సరస్సు ఒడ్డున, ఆహ్లాదకరమైన వాతావరణంలో చికాగో ఆంధ్ర సంఘం వారి మాతృదినోత్సవ వేడుకలు కన్నుల పండుగలా సాగాయి.
చికాగో ఆంధ్ర సంఘం (CAA) ఇటీవల మదర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించింది. చికాగో పరిసర ప్రాంతాల నుండి 200 మందికి పైగా తల్లులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. CAA అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు తమిస్రాకొంచాడ గార్లు ఆహ్వానితులకు సాదర స్వాగతం పలికారు.

-కార్యక్రమ ముఖ్యాంశాలు
శ్రీమతి సౌమ్య బోజ్జ (భారత్ ఇల్లినాయిస్ ) నిర్వహించిన ఉల్లాసభరితమైన జుంబా డ్యాన్స్ సెషన్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. దీని తర్వాత అంతే ఉత్సాహంగా 5K పరుగు పందెం నిర్వహించబడింది, ఇందులో వివిధ వయసుల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు.

-అవార్డులు మరియు సత్కారాలు
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో CAA ధర్మకర్తలు , కార్యవర్గ సభ్యులు వివిధ విభాగాల్లో విజేతలైన వారికి పతకాలతో సత్కరించారు. సంస్థ యువ కార్యవర్గ సభ్యులు శ్రీయ కొంచాడ, మయూఖ రెడ్డి అందంగా తయారు చేసిన గులాబీ పూల పుష్పగుచ్ఛాలను అందంగా అలంకరించారు. ఈ పుష్పగుచ్ఛాలను తల్లులకు, వారి కుటుంబ సభ్యులకు అందించి, అనంతరం అందరితో మదర్స్ డే కేక్ కట్ చేయించారు. ఈ వేడుక అంతా శివ పసుమర్తి గారు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనదైన శైలిలో అందరినీ అలరించారు.

-సంఘం మద్దతు – సహకారం
మురళీ రెడ్డి వారి నేతృత్వంలోని బృందం ఆహ్వానితులందరికీ అల్పాహారం సమకూర్చింది. హేమంత్ తలపనేని, చందు గంపాల, లోహిత గంపాల వచ్చిన ఆహ్వానితులను వయస్సుల వారీగా నమోదు చేసుకుని పరుగు పందెం కోసం కావలసిన సంఖ్యలను కేటాయించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు నరసింహ రెడ్డి, సాహితీ కొత్త, శృతి కుచంపుడి, శైలజ సప్ప, గిరి రావు, రామరావు కొత్తమాసు, వీరపనేని నరసింహారావు, సంస్థ పూర్వాధ్యక్షులు శైలేష్ మద్ది, మాలతీ పద్మాకర్, శ్వేతా కొత్తపల్లి గార్లు వారి వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో పాల్గొని వారి సహకారంతో విజయానికి ఎంతో తోడ్పడ్డారు.

-సేవా కార్యక్రమాల కోసం నిధుల సేకరణ
సునీత రాచపల్లి, అనురాధ గంపాల ఆధ్వర్యంలో హరిణి మేడ, ఉమా కొత్తమాసు సహాయంతో చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) ద్వారా నడిచే వివిధ సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరించే ఉద్దేశంతో, కూరగాయ మొక్కలను, నోరూరించే వివిధ రకాల పచ్చళ్ళను విక్రయించి, వచ్చిన విరాళాలను CAF ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమం అంతటా BOD టీమ్‌కి అండగా నిలిచిన ట్రస్టీలు డా. ఉమా ఆరమండ్ల కటికి, దినకర్ కారుమూరి, ప్రసాద్ , భార్గవి నెట్టెం, సుజాత అప్పలనేని గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

– సమిష్టి కృషితో విజయం
ఈ కార్యక్రమానికి సంస్థ ప్రస్తుత చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, 2025 ఉపాధ్యక్షులు తమిస్రాకొంచాడ, ఇతర కార్యవర్గ సభ్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు అందరూ పాల్గొని, కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సహాయ సహకారాలను, తోడ్పాటును అందించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కింద లింక్ లో చూడొచ్చు