‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాజులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు నవ పంచమి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతారు. పిల్లల విషయంలో నిరాశకరమైన వార్తలు వింటారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. పాత అప్పులు ఉంటే వాటిని తీరుస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో పూర్తి మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి అధికారులు సైతం సహకరిస్తారు. దీంతో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . . ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారులకు అనుకోకుండా సంపద పెరుగుతుంది. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకుంటారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడతారు
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఆస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల కెరీర్ పై నిర్ణయాలు తీసుకోవడంలో జీవిత భాగస్వామి సహకరిస్తుంది. మానసికంగా ఆందోళనతో ఉంటారు. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ఉన్నత విద్య పొందాలనుకునే విద్యార్థులు శుభవార్త వింటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఇబ్బందులు పెడతారు. ఇంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పిల్లల చదువు విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగులు సీనియర్లతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెండింగ్ లో ఉన్న అప్పు చెల్లించడంలో సోదరులు సహాయం చేస్తారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల్లో ఒకరు ధన సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమయంలో మాటలను నియంత్రించుకోవాలి. దూర ప్రయాణాలు చేయాలని అనుకుంటే సొంత వాహనాలపై వెళ్లకూడదు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఈ రాశి వారు మానసిక భారం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తుల కు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒకరి వివాహం గురించి చర్చించుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారికి పాతా అప్పులు వసూలు అవుతాయి. కొన్ని పెండింగ్ పనులు ఉండడంతో మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఏదైనా వివాదం ఉంటే మౌనంగా ఉండడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సమస్యను పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలి. కొన్ని పనుల వల్ల బిజీ వాతావరణంలో ఉంటారు.