Homeప్రవాస భారతీయులుCA Mahanadu : అమెరికా బే ఏరియాలో నందమూరి తారకరాముని 102వ జయంతి, మినీ మహానాడు...

CA Mahanadu : అమెరికా బే ఏరియాలో నందమూరి తారకరాముని 102వ జయంతి, మినీ మహానాడు సంబరాలు

CA Mahanadu : అమెరికాలోని బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి పర్యవేక్షణలో, టీడీపీ నాయకులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మిల్పిటాస్ నగరంలోని స్టార్ లైట్ పార్క్ వేదికగా జరిగింది.

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న మహానాడు కావడంతో, 150 మందికి పైగా అభిమానులు, మహిళలు, చిన్నారులు ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆడియో కాల్ ద్వారా తెలుగుదేశం అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం పరితపించిన సముజ్వల దీప్తి నందమూరి తారకరామారావు గారు చిరస్మరణీయుడని పేర్కొన్నారు. 40 అమెరికా నగరాల్లో సంవత్సరం పాటు తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరిపామని, ఇప్పుడు 102వ జయంతి మాత్రమే కాకుండా, ఆ మహనీయుని సినీ రంగ ప్రవేశం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భం కూడా కావడం హర్షణీయమని, ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాభినందనలు తెలిపారు.

ప్రముఖ దర్శకులు, సినీ నటులు కాశీవిశ్వనాధ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సినీ రంగానికి తలమానికమైన తారక రామారావు గారు మనిషి రూపంలో జన్మించిన పుణ్య పురుషులని, ఆయన 102వ జయంతి వేడుకలలో పాలుపంచుకునే అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.

కోగంటి వెంకట్ మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన రామారావు గారి జయంతి కార్యక్రమాలు జరిపే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలందరికీ మహానాడు సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా మరింత అంకితమౌతుందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, గాంధి పాపినేని, లియోన్ బోయపాటి, విజయ్ సాగర్ రెడ్డి సమన్వయపరచగా, భరత్ ముప్పిరాల, సీతారాం కొడాలి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, బ్రహ్మానంద నాయుడు దబ్బర, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, రవికిరణ్ ఆలేటి, కోన నరేంద్రనాధ్ రెడ్డి, తిరుపతిరావు, శ్రీనివాస్ ఆత్మకూరి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రాఘవయ్య, రాజా కొల్లి, హర్ష యడ్లపాటి, అనిల్ సాపినేని, చంద్రశేఖర్, రాంబాబు మానుకొండ, మోహన్, లోకేష్, యెంవీ రావు, గాంధి ప్రసాద్, సుబ్బారావు, కృష్ణ నరుకుళ్ళ, మునిరెడ్డి, నవీన్ కొడాలి తదితరులు పాల్గొన్నారు.

చేతన జాగర్లముడి, సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, రూప గుర్రం, విలేఖ్య వెనిగళ్ళ, రుద్రాణి తాతినేని, మాధురి వెన్నపూస, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి దబ్బర, శిరియాలు నెల్లూరి తదితర మహిళా మణులు హాజరవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బే ఏరియాలోని ప్రముఖ రెస్టారెంట్లు బిర్యానీ జంక్షన్, నాన్స్ & కర్రీస్, బిర్యానీస్ (మిల్పిటాస్), విజేత స్వగృహ ఫుడ్స్, ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (ఫ్రీమోంట్), ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (మౌంటైన్ వ్యూ) హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version