https://oktelugu.com/

New Jersey: న్యూజెర్సీలో బీజేపీ ‘ఛాయ్‌ పే చర్చ’

అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భాతీయ జనతాపార్టీ (OFBJP)ఆధ్వర్యంలో ‘ఛాయ్‌ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భాజపా మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 12, 2024 1:01 pm
    New Jersey

    New Jersey

    Follow us on

    New Jersey: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలకు నేడో రేపో షెడ్యూల్‌ రాబోతోంది. పార్లమెంటు ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కుతోంది. పొత్తులు, సీట్ల పంపకాలతో అన్ని పార్టీల్లో హడావుడి కనిపిస్తోంది. ఏపీలోనూ కూటమి లెక్కలు కొలిక్కి వచ్చాయి. ఇక బీజేపీ ఇప్పటికే 190 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌ 35 స్థానాలకు ప్రకటించింది. దేశంలో రాజకీయాలు ఇలా సాగుతుండగా, అగ్రరాజ్యం అమెరికాలు వివిధ పార్టీల మద్దతు దారులు అక్కడ కూడా సందడి చేస్తున్నారు. తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవలే టీడీపీ, వైఎస్సార్‌సీపీ అనుకూల దారులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా బీజేపీ మద్దతు దారులు కూడా ప్రత్యేక కార్యక్రమం చాయ్‌ పే చర్చ నిర్వహించారు.

    న్యూజెర్సీలో..
    అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భాతీయ జనతాపార్టీ (OFBJP)ఆధ్వర్యంలో ‘ఛాయ్‌ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భాజపా మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి విజయం సాధించాలని ఛాయ్‌ పే చర్చ, కాలతాన్, చౌకీదార్‌ మర్చా, కార్‌ ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధ్యక్షుడు అడపా ప్రసాద్‌ తెలిపారు.

    బీజేపీ గెలవాలని..
    తెలంగాణ బీజేపీ ఎన్నారై జాయింట్‌ కన్వీనర్‌ విలాస్‌ జంబుల ఛాయ్‌ పే చర్చలో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా విరాజిల్లుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా బీజేపీ గెలుపును కర్తవ్యంగా భావించాలని సూచించారు. మోదీ ఆశయాలను నెరవేర్చాలా బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ బలోపేతానికి, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు బీజేపీ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తోడ్పాటు అందించాలన్నారు.

    మోదీతోనే దేశానికి రక్షణ..
    ఇక ఓఎఫ్‌ బీజేపీ న్యూజెర్సీ టీం చరణ్‌సింగ్, అమర్, ధీరణ్, గణేశ్‌ మాట్లాడుతూ నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రదవాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీ నోట్లపై సర్జికల్‌స్ట్రైక్స్‌ చేశారని మోదీని ప్రశంసించారు. ఓఎఫ్‌ భాజపా న్యూజెర్సీ తెలంగాణ కమిటీ టీం సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, నాగ మహేందర్‌ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షాల సహకారంతో బీజీపీకి 400 సీట్లు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఛాయ్‌ పే చర్చ కార్యక్రమంలో ఓఎఫ్‌ బీజేపీ సభ్యులు హరిసేతు, దీప్‌భట్, ధీరేన్‌పటేల్, గణేశ్, మల్లికార్జున్, లీనా భట్, దీప్తి సురేశ్‌ జానీ, శరద్‌ అగర్వాల్, వంశీ యంజాల, మధుకర్‌రెడ్డి, ప్రదీప్‌ కట్ట, అల్కా బిజుర్వేదీ, సాయి దత్త పీఠం నుంచి రఘు శంకర మంచి, ఇతర సంస్థల నుంచి పలువురు మద్దతు తెలిపారు.