https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ ఎదుగుదలకి ఆ ప్రొడ్యూసర్ చేసిన అవమానమే కారణమా..?

కెరీయర్ మొదట్లో ఒక ప్రొడ్యూసర్ మొదట రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలని అనుకొని, ఆ తర్వాత ఆ బడ్జెట్ కి ఆయన మార్కెట్ వర్కౌట్ అవదనే ఉద్దేశ్యంతో తనని సినిమాలో నుంచి తీసేసారంట.

Written By:
  • Gopi
  • , Updated On : March 12, 2024 / 01:05 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ క్రేజ్ ముందు ఏ హీరో నిలబడలేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు, ఆయన సాధించిన విజయాలు అలాంటివి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాయి.

    అయితే కెరీయర్ మొదట్లో ఒక ప్రొడ్యూసర్ మొదట రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలని అనుకొని, ఆ తర్వాత ఆ బడ్జెట్ కి ఆయన మార్కెట్ వర్కౌట్ అవదనే ఉద్దేశ్యంతో తనని సినిమాలో నుంచి తీసేసారంట. ఇక అది మనసులో పెట్టుకున్న రజినీకాంత్ ఎలాగైనా సరే తన మార్కెట్ ని పెంచుకోవాలనే ఉద్దేశ్యం తో మంచి సినిమాలను చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు కూడా సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్నాడు తప్ప తగ్గించడం లేదు. అయితే ఆయనతో అలా అన్న ప్రొడ్యూసర్ ఎవరు అనేది బయట పెట్టకపోయిన కూడా దాని మీద అప్పట్లో కోలీవుడ్ మీడియా చాలా కథనాలను కూడా రాసింది.

    ఇక మొత్తానికైతే రజినీకాంత్ సూపర్ స్టార్ అవడానికి ఒక రకంగా ఆ ప్రొడ్యూసర్ చేసిన అవమానం కూడా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా జైలర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకున్న రజినీకాంత్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసి చూపించాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక మొత్తానికైతే ఇప్పటికి కూడా రజనీకాంత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

    ఆయన సినిమా కోసం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క అభిమాని కూడా అసక్తిగా ఎదురు చూస్తున్నాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఆయన లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు…