ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 18వ మహా సభలు అట్లాంటాలో జూన్ 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ సభలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఆటా మొదలు పెట్టింది. అమెరికాలోని తెలుగు వారంతా ఈ సభలకు హాజరయ్యేలా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా హ్యూస్టన్‌లో ప్రచార సభ నిర్వహించారు. ఆటా అధ్యక్షురాలు బొమ్మినేని మధు, కన్వీనర్ పాశం కిరణ్, మాజీ అధ్యక్షులు పిన్నపురెడ్డి శ్రీనివాస్, ఆసిరెడ్డి కరుణాకర్ తదితరులు హాజరయ్యారు. తానా సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తానా సభ్యులు శ్రీధర్ కంచనకుంట్ల, జయప్రకాష్ ముదిరెడ్డి, జగపతి రెడ్డి వీరాటి, బంగార్ రెడ్డి, దయాకర్ దవలాపూర్, వెంకట్‌రెడ్డి గార్లపాటి, దామోదర్ జమిల్లి, చందు మాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విరాళాల సేకరణ..
ఇక తానా సభలపై ప్రచారంతోపాటు సభల నిర్వహణకు అవసరమైన విరాళాలను సేకరిస్తున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే సభల కోసం తెలుగువారి నుంచే విరాళాలు సేకరిస్తున్నారు. హ్యూస్టన్‌లో నిర్వహించిన సమావేశంలో పలువురు తెలుగువారు విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలకు తానా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
వివిధ పోటీలు..
ఇదిలా ఉండగా తానా మహా సభల సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, రవి వీరెల్లి, కిరణ్ పాశం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నవలలు తమ స్వంతమనీ, అనువాదాలు, అనుసరణలు కాదనీ, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని, వేరే పత్రికల వద్ద పరిశీలనలో లేదనీ, ఫలితాలు వచ్చే వరకు ఎక్కడా ప్రచురింపబోమని పేర్కొంటూ రచయితలు హామీ పత్రం ఇచ్చారు. నవలల ఎంపికలో తుది నిర్ణయం మాత్రం ఆటా నిర్వాహకులదే. ఈమేరకు ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాద ప్రతివాదాలకు తావు లేదు. నవలలు పంపించే గడువు తేదీ పొడిగింపు విషయంలోగానీ, పోటీ రద్దు విషయంలోగానీ, బహుమతి మొత్తం మార్పు విషయంలో గానీ నిర్వాహకులదే తుది నిర్ణయం.
ప్రపంచ వ్యాప్తంగా నవలలు..
ఈ నవలల పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎవరైనా పాల్గొనవచ్చు. నవల తెలుగువారి జీవితానికి సంబంధించినది అయి ఉండాలి. నవల అచ్చులో కనీసం 150 పేజీలు ఉండాలి. ప్రపంచంలోని ఎక్కడి వారయినా ఈ పోటీకి నవవలు పంపవచ్చు. తెలుగులో డీటీపీ చేసిన కాపీలను లేదా చేతిరాతను స్కాన్ చేసిన కాపీలను ఈమెయిల్ ద్వారా atanovels2024@gmail.comకు పంపించారు. నవలల పోటీ విజేతలకు రూ.2 లక్షల బహుమతి అందించనున్నారు.