https://oktelugu.com/

MS Dhoni: ధోని కొత్త రోల్ ఇది.. ప్రకటించిన చెన్నై జట్టు.. వీడియో వైరల్

ధోని రాకను పురస్కరించుకొని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసింది. "అన్నయ్య (తలా) దర్శనం" అంటూ కామెంట్ చేసింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 6, 2024 / 11:12 AM IST

    MS Dhoni

    Follow us on

    MS Dhoni: మరో 16 రోజుల్లో ఐపిఎల్ టి20 17వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ క్రికెట్ పండుగ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 74 రోజులపాటు జరిగే ఈ టోర్నీ పై జట్ల యాజమాన్యాలు, అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చెన్నపురి లో అడుగు పెట్టారు. దీంతో తమిళ తంబిల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది. పదిసార్లు ప్లే ఆప్ కు వెళ్ళింది. ఈసారి కూడా టైటిల్ దక్కించుకుంటామనే ధీమా లో ఉంది.

    ధోని రాకను పురస్కరించుకొని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసింది. “అన్నయ్య (తలా) దర్శనం” అంటూ కామెంట్ చేసింది. ఇక గత సీజన్లో చెన్నై జట్టు గుజరాత్ పై గెలిచింది. ఈ గెలుపు ద్వారా ఐదో టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ఇక 17వ సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ జట్టుతో ప్రారంభ మ్యాచ్ ఆడనుంది.

    సామాజిక మాధ్యమాలలో అంతగా చురుకుగా ఉండని ధోని.. మూడు రోజుల క్రితం ఫేస్ బుక్ లో “కొత్త రోల్ కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. 17వ ఐపీఎల్ సీజన్లో ధోని పోషించే పాత్ర ఏమిటి? అనే దానిపై అభిమానులు తెగ శోధించడం మొదలుపెట్టారు. కొందరు చెన్నై జట్టుకు కోచ్ గా వెళ్తాడు అంటే, మరికొందరు మెంటార్ గా పనిచేస్తాడని కామెంట్లు చేశారు. వీటన్నింటినీ కాదని అతడు అన్నయ్యగా ఎంట్రీ ఇచ్చాడని చెన్నై జట్టు ఆనందంగా చెప్పేసింది.