https://oktelugu.com/

US Citizenship: 66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం.. మన స్థానం ఎంతో తెలుసా?

విద్య, ఉద్యోగాలకు వెళ్లిన చాలా మంది అక్కడే స్థిరపడుతున్నారు. ప్రతిభ ఉన్నవారికి అక్కడి కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. దీంతో అమెరికాలో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 22, 2024 / 06:10 PM IST

    US Citizenship

    Follow us on

    US Citizenship: ప్రపంచంలో అనేక దేశాల యువతకు డాలర్‌ డ్రీమ్‌గా మారింది అగ్రరాజ్యం అమెరికా. చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలన్న స్వప్నం కారణంగా ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన వారు అమెరికాలో ఉన్నత చదువుల కోసం క్యూ కడుతున్నారు. అక్కడ చదువుకున్నవారు అక్కడే స్థిరపేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గతంలో అడిగన వారందరికీ వీసాలు ఇచ్చిన అమెరికా.. ఇప్పుడు వలసలు పెరగడంతో వీసాలపై పరిమితి విధించింది. ప్రధానంగా భారత్‌ నుంచి ఏటా అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం.

    అమెరికా సిటిజన్‌షిప్‌..
    విద్య, ఉద్యోగాలకు వెళ్లిన చాలా మంది అక్కడే స్థిరపడుతున్నారు. ప్రతిభ ఉన్నవారికి అక్కడి కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. దీంతో అమెరికాలో భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్రమంగా అక్కడే స్థిరపడి అమెరికా పౌరసత్వం పొందుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 66 వేల మంది అమెరికా సిటిజన్‌షిప్‌ తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉందని యూఎస్‌ కాంగ్రెషనల్‌ తాజా నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నట్టు తెలిపింది. 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరులైనట్టు పేర్కొంది. అమెరికా జనగణన బ్యూరో ప్రకారం.. 2022 నాటికి ఆదేశ జనాభా 33 కోట్ల. ఇందులో విదేశీయులు 14 శాతం(46 మిలియన్ల) మంది ఉన్నారు. వీరిలో 24.5 మిలియన్లు అంటే దాదాపు 53 శాతం మంది అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందినట్లు నివేదించారు. 2022లో స్వతంత్ర కాంగ్రెషనల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ ఏప్రిల్‌ 15న వెల్లడించిన ‘యూఎస్‌ నేచురలైజేషన్‌ పాలసీ’ నివేదిక ప్రకారం 9,69,380 మంది విదేశీయులు అమెరికా పౌరులుగా మారారు.

    మొదటి స్థానంలో మెక్సికో…
    ఇక అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో మెక్సికన్లు అత్యధికంగా ఉన్నారు. తర్వాతి స్థానంలో భారత్, ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినిక్‌ రిపబ్లిక్‌ నుంచి వచ్చిన వారు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. 2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరులుగా అధికారికంగా మారారు. తర్వాత భారత్‌ (65,960), ఫిలిప్పీ¯Œ ్స (53,413), క్యూబా (46,913), డొమినికన్‌ రిపబ్లిక్‌ (34,525), వియత్నాం (33,246), చైనా (27.038) పౌరులు ఉన్నారు. సీఎస్‌ఆర్‌ నివేదిక ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయులది రెండో స్థానం( 2,831,330 మంది). మొదటి స్థానంలో మెక్సికన్లు (10,638,429), మూడోస్థానంలో చైనీయులు (2,225,447) ఉన్నారు.

    పెండింగ్‌లో దరఖాస్తులు..
    అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో 42 శాతం మంది అమెరికా పౌరసత్వానికి అనర్హులని సీఆర్‌ఎస్‌ నివేదిక తెలిపింది. 2023 నాటికి గ్రీన్‌ కార్డ్‌ లేదా లీగల్‌ పర్మనెంట్‌ రెసిడెన్సీలో ఉన భారతీయలు మాత్రమే అర్హులని తెలిపింది. ఇదిలా ఉంటే 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి యూఎస్‌సీఐఎస్‌ వద్ద సుమారు 4,08,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో 9,43,000 దరఖాస్తు ఉండగా.. 2021 చివరి నాటికి 8,40,000కి.. 2022 చివరి నాటికి 5,50,000 లకు తగ్గించింది. ఇక అమెరికాకు సహజంగా వలస వచ్చిన విదేశీయుల్లో హోండురాస్, గ్వాటెమాలా, వెనిజులా, మెక్సికో, ఎల్‌ సాల్వడార్, బ్రెజిల్‌లో జన్మించినవారు అతి తక్కువ శాతం.. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్థాన్‌ నుంచి వచ్చినవారు అత్యధికంగా ఉన్నారు.