NTR: స్టైల్ మార్చిన ఎన్టీఆర్… కేకపుట్టిస్తున్న నయా లుక్!

వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మల్టీస్టారర్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.

Written By: S Reddy, Updated On : April 22, 2024 6:16 pm

NTR

Follow us on

NTR: ఎన్టీఆర్ రెండు చిత్రాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ. అటు దేవర ఇటు వార్ 2 షూటింగ్స్ ఏక కాలం లో పూర్తి చేస్తున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ రెండు చిత్రాల్లో ఆయన డిఫరెంట్ లుక్స్ మైంటైన్ చేయాల్సి ఉంది. ఇటీవల ఎన్టీఆర్ ముంబై వెళ్లారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో వార్ 2 షూటింగ్ షెడ్యూల్ ఏర్పాటు చేయగా పాల్గొన్నారు. వార్ 2 కోసం ఆయన లుక్ మార్చారు. చాలా స్టైలిష్ గా తయారయ్యారు. వార్ 2లో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. అందుకు తగ్గట్టే గెటప్ మార్చాడు.

మరి రా ఏజెంట్ అంటే స్టైలిష్ గా ఉండాలి. అందుకే ఉంగరాల జుట్టును తగ్గించారు. వార్ 2 చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ లో పాల్గొన్నాడు ఎన్టీఆర్. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆయన మరలా ముంబై వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ దర్శనం ఇచ్చాడు. ఆయన లుక్ రివీల్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. సూపర్ గా ఉన్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ మల్టీస్టారర్ పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 కావడం విశేషం. ఇక దేవర విషయానికి వస్తే… దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. దేవర రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఇక దేవర మూవీలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె సౌత్ లో అడుగుపెడుతుంది. దేవర చిత్రంలో జాన్వీ పాత్రకు మంచి వెయిట్ ఉంటుందని కొరటాల శివ గతంలోనే చెప్పాడు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. విజువల్ వండర్ గా దేవర ఉంటుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.