Devara Movie: పోకిరిని మించిన క్లైమాక్స్ ట్విస్ట్ తో రానున్న దేవర.. ఎన్టీయార్ ఫ్యాన్స్ కి పూనకాలే…

దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల వరకు డీల్ కుదిరినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : April 22, 2024 6:01 pm

Mind Blowing twist in Devara Movie

Follow us on

Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్..ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తూన్నాయి. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తనదైన రీతి లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల వరకు డీల్ కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాని కోసమే కొరటాల శివ గానీ, జూనియర్ ఎన్టీఆర్ గానీ తమ శక్తికి మించి మరి ఈ సినిమా కోసం తమ కష్టాన్ని దారబోస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఎవరు ఊహించని విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట.

అయితే ఈ ట్విస్ట్ ఒకవేళ రివిల్ అవుతాయేమో అనే ఉద్దేశ్యంతో ఆ సీన్ తీయడానికి ఎంతమంది అయితే ఆర్టిస్టులు కావాలో అంతమంది ఆర్టిస్టులను మాత్రమే తీసుకొని ఆ సీన్ ను తీసారట. వేరేవాళ్ళు కూడా ఆ సీన్ తీసేటపుడు ఉంటే ట్విస్ట్ రివిల్ అవుతుందనే ఉద్దేశ్యం తో ఆ సీన్ షూట్ చేసినపుడు ఆయన ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా షూట్ ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్టీఆర్ అయితే ఉవ్విళ్లూరుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ రెండు ట్విస్ట్ లు సినిమాకి కీలకంగా మారిబోతున్నాయి అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోకిరి సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఎంతలా ఎలివేట్ అయిందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా పేలబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…