Vastu Tips: మనలో కొంతమందిని తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూ ఉంటుంది. మందులు వాడితే ఆ సమస్య తగ్గినా తర్వాత మరో కొత్త ఆరోగ్య సమస్య మొదలవుతూ ఉంటుంది. ఆర్థికంగా సంపన్నులు అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల బాధ పడేవాళ్లు చాలామంది ఉంటారు. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇంట్లో పగిలిన అద్దాలను ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు. కిటికీలు, తలుపులపై పగుళ్లు ఏర్పడితే వాటిని వెంటనే మారిస్తే ఆరోగ్యానికి వాస్తు ప్రకారం మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో దూలం ఉంటే ఆ దూలం కింద పడుకోవడం కూర్చోవడం చేయడం మంచిది కాదు. వాస్తు దోషాలు ఉన్న ఇళ్లలో పుట్టిన పిల్లలను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉత్తర దిశలో సరిహద్దు గోడ తూర్పు దిశలో ఇల్లు ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఇల్లును నిర్మించుకుంటే ఇంట్లో సూర్య కిరణాలు పడి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి.