KCR: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ఆయన వెంట ఉండాల్సి ఉన్నా ఉండకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దేశానికి ప్రధాని వస్తే కనీసం మర్యాదపూర్వకంగా గానీ కలవకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు ఇంత అహంకారమా అనే వాదనలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం కేసీఆర్ కు ఇక రోజులు దగ్గర పడ్డాయనే సంకేతాలు సైతం వస్తున్నాయి. కేంద్రంతో పెట్టుకుంటే అంతే సంగతి చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకునే చర్యలకు కేసీఆర్ ఎలా బాధ్యుడవుతారో అని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో పశ్చిమ బెంగాల్లో ఇదే పరిస్థితి ఏర్పడితే సీఎం మమతా బెనర్జీకి చుక్కలు చూపించారు. గవర్నర్ ద్వారానే మమతను అన్ని విషయాల్లో కష్టాల్లో పడేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కూడా గవర్నర్ తో కేసీఆర్ కు చిక్కులే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విషయాల్లో విభేదాలు స్పష్టంగా గోచరిస్తుండటంతో దానికి మరింత రంగు పులిమి కేసీఆర్ ను ఇబ్బందులకు గురిచేసేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: చిరంజీవి, ఆర్జీవీ మూవీ మధ్యలో ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?
అనవసరంగా కేంద్రంతో పెట్టుకున్నారని చెబుతున్నారు. కేసీఆర్ ఏదో చేస్తానని అనుకుంటున్నారు. వాపును చూసుకుకుని బలుపనుకుంటున్నారు. అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నా కేసీఆర్ మాత్రం తానేదో మూడో కూటమి ఏర్పాటు చేస్తానని ప్రగల్బాలు పలకడం చూస్తుంటే దారుణంగా దెబ్బతింటాడని తెలుస్తోంది. అయినా ఏదో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, బీజేపీని దెబ్బ తీస్తానని అనుకోవడం ఆయన భ్రమే అవుతుంది.
ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి మన గవర్నర్ తమిళిసౌ సౌందర్య రాజన్ కు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ప్రణాళికలకు పదును పెడుతున్నట్లు సమాచారం. ఇక తమిళిసై దూకుడు పెంచి తెలంగాణ సర్కారును కష్టాల్లోకి నెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరంగా కేంద్రంతో పెట్టుకుని కేసీఆర్ తలగోక్కుంటున్నారని తెలుస్తోంది. కానీ కేసీఆర్ కు వినాశకాలే విపరీతబుద్ది పట్టినట్లు భావిస్తున్నారు.
అదే ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కు అంత బలమున్నా ఆయన బీజేపీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. కానీ కేసీఆర్ కు ఎందుకు ఇంత దురద అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. కేంద్రం తలుచుకుంటే కేసీఆర్ పని ఎంత సేపు. దీంతో కేసీఆర్ పతనానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ కు ఇక చుక్కలు చూపించడం ఒక్కటే మిగిలిందనే విషయం అందరికి అర్థమైపోతోంది.