https://oktelugu.com/

ప్చ్.. ‘ప్రగతి’ ఆంటీ హీరోయిన్ గా చేస్తోందట !

టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఆంటీ ఒకరు. హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి, త్వరలో ఆమె మెయిన్ లీడ్ గా ఓ ఓటీటీ సినిమా చేయబోతుందట. మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా హీరోయినే అని అర్ధం. ఏమైనా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో రెచ్చగొట్టే ప్రగతి ఆంటీ, మొత్తానికి తనలోని హీరోయిన్ ను […]

Written By:
  • admin
  • , Updated On : November 13, 2020 / 05:30 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నేటి నటిమణుల్లో ‘ప్రగతి’ ఆంటీ ఒకరు. హీరోయిన్లకు అలాగే స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రగతి, త్వరలో ఆమె మెయిన్ లీడ్ గా ఓ ఓటీటీ సినిమా చేయబోతుందట. మెయిన్ క్యారెక్టర్ అంటే.. ఒక రకంగా హీరోయినే అని అర్ధం. ఏమైనా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో రెచ్చగొట్టే ప్రగతి ఆంటీ, మొత్తానికి తనలోని హీరోయిన్ ను లేట్ వయసులో చూపించబోతుంది అన్నమాట. అసలు ఈ లాక్ డౌన్ లో ప్రగతి ఆంటీ సోషల్ మీడియాలో చేసిన సెన్సేషన్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది.

    Also Read: తన బయోపిక్ ‘ఆకాశం నీ హద్దురా’పై స్పందించిన కెప్టెన్ గోపీనాథ్

    ఆమె వదిలిన వీడియోల్లో ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల గురించి, ఆమె మాస్ స్టెప్స్ గురించి ఇప్పటికీ ఆమెకు కామెంట్స్ వస్తున్నాయి అంటే.. ఆంటీ సృష్టించిన గ్లామర్ సంచనాలు మామూలువి కాదు. ఇంతకీ ప్రగతి ఆంటీని పెట్టి సినిమా తీస్తోన్న వాళ్ళు ఎవరంటే.. జీయల్ సురేందర్ అట. ఇతను గతంలో రవిబాబు మెయిన్ లీడ్ గా సితార అనే ప్లాప్ సినిమా తీశాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లుకు ప్రగతి ఆంటీని పెట్టుకుని ఓ డిఫ‌రెంట్ హారర్‌ థ్రిల్ల‌ర్‌ చేయబోతున్నాడు. కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌తో మంచి సందేశాత్మ‌క చిత్రంగా ఈ సినిమా రూపొందుతోందట.

    Also Read: టాలీవుడ్ అప్డేట్.. సంక్రాంతి ఆశలు కూడా గల్లంతేనా?

    మరి ఏంటో.. ఆ కొత్త త‌ర‌హా స‌బ్జెక్ట్‌ ? మంచి సందేశాత్మ‌క చిత్రం ? ఏది ఏమైనా ప్రగతి ఆంటీని కూడా హీరోయిన్ ను చేస్తోన్నందుకు ఈ డైరెక్టర్ ను మెచ్చుకోవాల్సిందే. కాకపోతే నిర్మాతను చూసే జాలి పడాలి. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో. అయితే సినిమా హిట్ ప్లాప్ అనేది పక్కన పెడితే.. ప్రగతి ఫాలోవర్స్ అందరూ ఈ సినిమా చూస్తారు. ఓ వైపు డ్యాన్స్ లతో, మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి సోషల్ మీడియాలో ఎలాగూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాబట్టి ఆ ఫాలోయింగ్ ఈ సినిమాకి కాస్త అయినా ఉపయోగపడుతుంది అనుకోవాలి. మొత్తానికి ఏభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి సోలోగా సినిమా చేయడం అంటే నిజంగా విశేషమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్