Star Heroine: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. ఎవరి ఆలోచనలు, అలవాట్లు ఎలా ఉంటాయో చెప్పలేం అనడానికి ఆ సామెత వాడతారు. టాలీవుడ్ లో నటుల్లో చాలామంది పెట్ లవర్స్ ఉన్నారు. ముద్దుగా ఒకటి రెండు కుక్కలను పెంచుకుంటారు. రష్మిక మందానకు కూడా పెట్ డాగ్స్ ఉన్నాయి. ఒకటి మ్యాక్సీ కాగా మరొక దాని పేరు ఆరా. ఇంట్లో ఉంటే ఈ పెట్ డాగ్స్ తో ఆహ్లాదంగా గడుపుతుంది రష్మిక. వాటిని కుటుంబ సభ్యుల కంటే మిన్నగా ప్రేమిస్తుంది.
ఇంతవరకు ఓకే. కానీ.. ఆమెకు కుక్క బిస్కెట్స్ తినే అలవాటు ఉందట. సాధారణంగా ఆకలి వేస్తే భోజనం చేస్తారు. లేదంటే.. స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తింటారు. రష్మిక మాత్రం కుక్క బిస్కెట్స్ తింటుందట. ఈ విషయాన్ని హీరో నితిన్ స్వయంగా వెల్లడించారు. భీష్మ చిత్రంలో నితిన్-రష్మిక మందాన జంటగా నటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్. ఆ మూవీ ప్రమోషన్స్ లో హీరో, హీరోయిన్ పాల్గొన్నారు.
నితిన్ ని యాంకర్ ఓ ఇంటర్వ్యూలో రష్మిక గురించి మాకు ఎవరికీ తెలియని ఒక రహస్యం చెప్పాలని కోరింది. తడుముకోకుండా, రష్మికకు కుక్క బిస్కెట్స్ తినే అలవాటు ఉందని చెప్పేశాడు. ఇది నిజం. ఆమెకు ఆ అలవాటు ఉంది. రష్మిక చెప్పొద్దని ఎంత వారించినా.. వినకుండా నితిన్ చెప్పేశాడు. స్టార్ హీరోయిన్ గా రష్మిక కోట్లు సంపాదిస్తుంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఆమె. సినిమాకు రూ. 5-10 కోట్లు తీసుకుంటుంది. అలాంటి రష్మిక కుక్క బిస్కెట్స్ తినడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది రష్మిక. ఆ మూవీ ఏకంగా రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలై నాలుగు వారాలు అవుతున్న వసూళ్లు కొనసాగుతున్నాయి. కేవలం హిందీ వెర్షన్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ కి జంటగా సికిందర్ మూవీ చేస్తుంది. ఈ మూవీ రంజాన్ కానుకగా విడుదల కానుంది. మురుగదాస్ దర్శకుడు. కుబేర టైటిల్ తో ధనుష్, నాగార్జునలతో ఒక చిత్రం చేస్తుంది.