BJP,YCP and TRS: పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్ భిన్న వ్యూహాలను అవలంభిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్న గులాబీ పార్టీ ఎంపీలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిచారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శిస్తున్నారు. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎంపీలు మాత్రం టీఆర్ఎస్ కు భిన్నమైన వైఖరి తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

రాష్ట్రప్రయోజనాల కోసం తమ పోరాటం బలంగా ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. కాగా, వైసీపీ ఎంపీలు మాత్రం బీజేపీకి బేషరతుగా మాద్దతు తెలపాలని, ఎలా కావాలంటే అలా సహకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెగాసస్ స్పైవేర్ పై చర్చకు పట్టబట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్న క్రమంలో అది అసలు జనాలకు అవసరం లేని విషయమని, దానిపైన చర్చనే అవసరం లేదని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంతటితో ఆగకుండా పార్లమెంటు సమావేశాలను అడ్డుకునే వారిని క్షమించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తద్వారా స్పష్టంగానే తాము బీజేపీకి అండగా నిలుస్తున్నామని చెప్తున్నది వైసీపీ.
Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
23 పాయింట్ల ఎజెండాతో కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. దాంతో ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. తెలంగాణకు రావాల్సిన అంశాలపైన ఫోకస్ చేస్తున్నారు. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, విపక్షాలు మాత్రం పెగాసస్ అంశాన్ని తెర మీదకు తెచ్చి దాని పైన రచ్చ రచ్చ చేయాలని చూస్తున్నాయి. కాగా, వైసీపీ మాత్రం తాము విపక్షాల వైపు లేమని, అధికార పక్షం బీజేపీ వైపే ఉన్నామని స్పష్టంగా తెలిపారు.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?
వైసీపీ ఎంపీలు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు తెలపడం వెనక ఉన్న మతలబు కేసులేనా అని ఈ సందర్భంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నది. నిజానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలు చాలానే ఉన్నాయి. కానీ, వాటిని గురించి ఎందుకో ఆ పార్టీ ఎంపీలు అడగడం లేదు. అయితే, రాజకీయ అవసరాల నేపథ్యంలోనే వైసీపీ ఈ మేరకు వ్యవహరిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ పార్టీ అధినేత జగన్ అనుకున్న స్ట్రాటజీ ప్రకారమే ఆ పార్టీ ఎంపీలు ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.