Land Registration: దేశంలో ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ కోసం మాన్యువల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కాగా, ఇకపై డిజిటల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ ప్రకారంగా భూములను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం చర్యలు ఉండనున్నాయి.
ఆ ప్రకారంగా ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా సేల్స్, ఇతర డీడ్స్ చేసుకోవచ్చు. ఇందుకుగాను ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించబోతున్నారు. ఫలితంగా మీరు ఎక్కడైనా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్ చేసేందుకుగాను యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించనుంది. ఈ పద్ధతి ద్వారా దేశంలోని ప్రతీ ప్లాట్‌కు, స్థలానికి, భూమికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ రానుంది. అలా ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. రిజిస్టర్ అయినట్లే.. అనగా మనుషులకు ఎలాగైతే ఆధార్ కార్డు ఉంటుందో..అలాగే ప్రతీ ప్లాట్, స్థలం, భూమికి ఆధార్ లభిస్తుంది.
Also Read: Union Budget Of India 2022: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?
ఇందులో భాగంగానే షెడ్యూల్ 8 లోని భూములు ల్యాండ్ రికార్డ్స్‌ను డిజిటల్ పద్ధతిలోకి మార్చడానికి చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో లింకేజీ చేయబోతున్నారు. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా దేశంలో ఎక్కడైనా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. వీటి కోసం కావాల్సిన చట్ట సవరణలను కేంద్ర ప్రభుత్వం చేయనుంది. నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే స్టార్ట్ అయింది కూడా.
Also Read: Union Budget Of India 2022: బడ్జెట్ 2022: కరోనా వేళ ఊరటదక్కేనా? ఐటీ పరిమితి పెరిగేనా? ఊసురుమంటారా?
అక్కడి రిజల్ట్స్ ను బట్టి దేశవ్యాప్త అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ విధానం సక్సెస్ అయితే దేశ ప్రజలకు చక్కటి మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, సాధ్యా సాధ్యాలు అమలులో ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు పరిశీలించనున్నారు. దేశంలో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరు రిజిస్ట్రేషన్, ఇతర డీడ్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతుండటం మనం చూడొచ్చు. తెలంగాణాలో ఇప్పటికే రెండు సార్లు భూముల విలువ పెంచగా, రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్స్ జరుగుతుండటం మనం చూడొచ్చు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భూమి కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.