
ICC Women’s T20 World Cup 2022/23 : సంచలన విజయంతో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికాను సొంత గడ్డపై విశ్వవిజేతగా నిలిచే అరుదైన అవకాశం ఊరిస్తోంది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా తో సౌత్ ఆఫ్రికా తలపడబోతోంది. వరుసగా ఏడోసారి ప్రపంచ పోరుకు చేరిన డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టడం సౌత్ ఆఫ్రికాకు అంతా సులభమైన విషయం కాదు. కానీ, సెమిస్లో బలమైన ఇంగ్లాండ్ పై సాధించిన సంచలన విజయంతో సఫారీలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అదే స్ఫూర్తితో మొదటిసారి కప్ కలను నెరవేర్చుకోవాలని సంకల్పంతో ఉన్నారు.
గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సెమిస్టర్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆట తీరు చాలా మారింది. లారా వోల్వర్డ్, తజ్మీన్ బ్రిట్స్ రూపంలో అత్యుత్తమ ఓపెనింగ్ జోడి అందుబాటులో ఉండటం సౌత్ ఆఫ్రికాకు బలంగా మారింది. ఇక ఆల్రౌండర్ కాప్ తో పాటు ఫేస్ ద్వయం ఇస్మాయిల్, అయోబంగ, టీం లో ఉండటంతో కెప్టెన్ సునే లుస్ విజయంపై ఎంతో ధీమాగా ఉంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనుకుంటున్నది. అయితే ఆస్ట్రేలియా తో పోలిస్తే సౌత్ ఆఫ్రికా మీదనే ఒత్తిడి ఎక్కువుంది.
ఐదుసార్లు వరల్డ్ కప్ నెగ్గిన అనుభవం ఆస్ట్రేలియా సొంతం. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం ఆ జట్టుకు లాభం చేకూర్చే అంశం. క్లి ష్ట సమయాల్లో పట్టువీరకుండా పోరాడే ఆస్ట్రేలియా.. ఆరోసారి సాధించాలని పట్టుదలతోగా ఉంది. గ్రూప్ దశలో మెగ్ లానింగ్ సేన తమ సత్తాకు తగ్గ ఆటను ప్రదర్శించకపోయినప్పటికీ… ఇబ్బంది లేకుండానే తుది పోరుకు చేరుకుంది.. సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడించినంత పని చేసినా.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఒత్తిడిని అధిగమిస్తూ మ్యాచ్ సొంతం చేసుకుంది..బ్యాటింగ్ లో లానింగ్, పెర్రీ హీలీ రాణిస్తున్నారు..ఆల్ రౌండర్ అష్లె ను తక్కువ అంచనా వేయడానికి లేదు.. స్కట్, బ్రౌన్ బౌలింగ్లో అదరగొడుతున్నారు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా ఫేవరెట్ జట్టులా కనిపిస్తోంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా సంచలనం సృష్టించాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్ కు తెలుగు గండికోట సర్వలక్ష్మి మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనుంది. ఫీల్డ్ ఎంపైర్లుగా కిమ్ కాటన్, జాక్వెలిన్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ మ్యాచ్ రిఫరిగా నియమితురాలైన (2019) తొలి మహిళగా లక్ష్మీ ఘనత వహించింది.
వేదిక; కేప్ టౌన్(దక్షిణ ఆఫ్రికా)
జట్ల అంచనా ఇలా
ఆస్ట్రేలియా
అలిస్సా హీలి, బెత్ మూనీ, మెగ్ లానింగ్, ఆశ్లే గార్డ్ నర్, ఎల్లిస్ ఫెర్రీ, తహలియా మెక్ గ్రాత్, గ్రేస్, జార్జియా వేర్హమ్, జెస్ జొనాసెన్, మేగన్ స్కట్, డార్సీ బ్రౌన్.
సౌత్ ఆఫ్రికా
బ్రిట్స్, లారా, మరిజన్నే కాప్, సునె లుస్, చ్లో ట్రయాన్, బాష్, నడయిన్ డి క్లర్క్, సినాలో జాప్టా, షబ్నిం ఇస్మాయిల్, అయోబంగ ఖకా, మ్లబా