
MS Dhoni – Virat Kohli : ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ మరియు మహేందర్ సింగ్ ధోనికి మధ్య ఉన్న అనుబంధం ని చూసి అభిమానులు సైతం ఎంతో మురిసిపోతుంటారు. ముఖ్యంగా కోహ్లీ అయితే ధోని గురించి మాట్లాడినప్పుడల్లా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ధోని విజయం సాధిస్తే తానూ విజయం సాధించినంత సంతోషంగా ఫీల్ అయ్యే వ్యక్తి కోహ్లీ.
అంతే కాదు తాను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన వాళ్లలో ఒకరు నా భార్య అనుష్క శర్మ అయితే, మరొకరు ధోని అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కోహ్లీ. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఈ విషయాన్నీ గుర్తు చేసుకున్నాడు.
కోహ్లీ మాట్లాడుతూ ‘ధోని సాధారణంగా ఫోన్ ని చాలా తక్కువ వాడుతాడు.ఆయనకి ఫోన్ చేసిన సరిగా లిఫ్ట్ చెయ్యడు.అలాంటి ధోని నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ నుండి రెండు సార్లు మెసేజిలు వచ్చాయి.వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.’నువ్వు బలమైన ఆత్మవిశ్వాసం గల వ్యక్తివి అని అనుకున్నప్పుడు అవతలి వాళ్ళు నిన్ను పట్టించుకోవడం మానేస్తారు.ఇలాంటి సంఘటనలు నాకు కూడా చాలానే జరిగాయి,నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు దృఢమైన మనిషిగా, బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన వాడిగానే చూసారు.ఎన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనా తట్టుకొని నిలబడగలను అని , సమస్యలను పరిష్కరిస్తాను అని నా పక్కన ఉన్నవాళ్ళు నమ్మేవారు.ఒక మనిషి ఎదో ఒకదశలో రెండు అడుగులు వెనక్కి తగ్గి మనం ఎలా ఉన్నాం అని ఆలోచించుకోవాలని గ్రహిస్తాం’ ‘ అని ధోని చెప్పినట్టు కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు.ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.