Rashid Khan: దేశంలో ఐపీఎల్ సంబరం దగ్గరపడుతోంది. ఆటగాళ్ల వేలానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఏ జట్టుకు ఏ ఆటగాడిని తీసుకోవాలనే దానిపై మళ్లగుల్లాలు పడుతున్నాయి. బీసీసీఐ ఆధ్వర్యంలోనే ఆటగాళ్ల వేలానికి ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఈనేపథ్యంలో అహ్మదాబాద్, లక్నో జట్లకు ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునేందుకు బీసీసీఐ వీలు కల్పిస్తోంది. దీంతో ఆటగాళ్లను తమ జట్లకు వేలంలో కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను తమ జట్టులోకి తీసుకోవాలని లక్నో ప్రయత్నిస్తోంది. కానీ అహ్మదాబాద్ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అతడి రాకతో అహ్మదాబాద్ విజయాలు నమోదు చేస్తుందని అందరు భావిస్తున్నారు. ఇంతకాలం హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడిన రషీద్ ప్రస్తుతం ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడో తెలియడం లేదు. హార్థిక్ పాండ్యాను అహ్మదాబాద్ జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. లోకేష్ రాహుల్, శ్రీయస్ అయ్యర్ లను లక్నో ఫ్రాంచైజీ తీసుకోనుందని తెలుస్తోంది.
Also Read: ఐపీఎల్ లో కీలక పరిణామాలు.. టాటా గ్రూప్ కు స్పాన్సర్ బాధ్యతలు
హైదరాబాద్ సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను వదులుకోవడంతో ఆయనను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు వేలంలో దక్కించుకోవాలని చూస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో బెంగుళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో ఐపీఎల్ నిర్వహణపై ఆసక్తి పెరుగుతోంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో మ్యాచ్ ల నిర్వహణపై అందరిలో ఆందోళన నెలకొంటోంది. ఐపీఎల్ సజావుగా సాగుతుందో లేదో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీంతో విదేశాల్లో కూడా మ్యాచుల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. దక్షిణాఫ్రికా, యూఏఈ, శ్రీలంకలలో మ్యాచులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ ప్రాధాన్యం మాత్రం మన దేశానికే ఇవ్వనుంది. దీంతో ఐపీఎల్ నిర్వహణ ఎలా ఉంటుందో అనే సంశయాలు నెలకొన్నాయి.
Also Read: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..