చేయిచేసుకుంటావా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగబోతుంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ దుబ్బాక నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఘెరావ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. మండల అధ్యక్షుడు సిలివేరి […]

Written By: NARESH, Updated On : September 21, 2020 11:19 am
Follow us on

దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగబోతుంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ దుబ్బాక నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఘెరావ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం జరుగుతుండగా కనకరాజ్ అనే వ్యక్తి తనకు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ను, మల్లారెడ్డిని నిలదీశాడు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగా ఎమ్మెల్యే అతడిపై చేయిచేసుకున్నట్లు తెలుస్తోంది.

సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే తన గ్రామానికి చెందిన వ్యక్తిపై చేయిచేసుకోవడంతో గ్రామస్థులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా ఊరికొచ్చి మా పిల్లలపై చేయి చేసుకుంటావా?’ అంటూ ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఎమ్మల్యే క్రాంతి కుమార్ గ్రామస్థులకు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే క్రాంతికుమార్ స్పందిస్తూ తాను ఎవరిపై చేయిచేసుకోలేదని స్పష్టం చేశారు. కనకరాజు అనే వ్యక్తి సమావేశంలో తనకు సభ్యత్వం ఇవ్వలేదని గొడవకు దిగగా అతడి భుజంపై చేయివేసి సముదాయించానని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఈ సంఘటన నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.