https://oktelugu.com/

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చేసే ఈ మూడు సినిమాల్లో భారీ సక్సెస్ అయ్యే సినిమా ఏదంటే..?

రాహుల్ సాంకృత్యాన్ ఇంతకు ముందు చేసిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని సాధించింది. ఇక దాంతోనే విజయ్ తనకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 30, 2024 / 12:24 PM IST
    Vijay Devarakonda

    Vijay Devarakonda

    Follow us on

    Vijay Devarakonda: అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అయితే సంపాదించు కున్నాడు. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్థాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక వరుస సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈయన మూడు సినిమాలకు కమిట్ అయితే ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

    ఇక ఇదిలా ఉంటే విజయ్ ఇప్పుడు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రవి కిరణ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. దీంతో పాటుగా రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో కూడా ఒక పిరియాడికల్ డ్రామా సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇక ఇంతకుముందే గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్ లో సినిమా చేయడానికి కమిట్ అయి షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉంటున్నాడు… ఇక ఈ మూడు సినిమాల మీద మంచి బజ్ ఉన్నప్పటికీ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం…

    అయితే ఈ మూడు సినిమాల్లో రాహుల్ సంకృత్యాన్ చేస్తున్న సినిమా భారీ సక్సెస్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా 1850 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా భారీ సక్సెస్ ను కూడా కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఈ మూడు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది.

    అయితే రాహుల్ సాంకృత్యాన్ ఇంతకు ముందు చేసిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాన్ని సాధించింది. ఇక దాంతోనే విజయ్ తనకు మంచి అవకాశాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు కూడా వీళ్ళ కాంబో లో టాక్సీవాలా అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించింది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…