Bade Miyan Chote Miyan OTT: అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ ల మల్టీ స్టారర్ బడే మియా చోటే మియా. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో బడే మియా చోటే మియా నిర్మించారు. మానుషీ చిల్లర్, అలయ ఎఫ్ హీరోయిన్స్ గా నటించారు. బడే మియా చోటే మియా చిత్రంలో సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమార్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. బడే మియా చోటే మియా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 11న వరల్డ్ వైడ్ విడుదల చేశారు.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బడే మియా చోటే మియా పరాజయం పాలైంది. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తే కనీసం వంద కోట్లు వసూలు చేయలేకపోయింది. బడే మియా చోటే మియా పరాజయం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లలో నిరాశ నింపింది. కేవలం రూ. 90 కోట్ల వసూళ్లు బడే మియా చోటే మియా సాధించింది.
కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. బడే మియా చోటే మియా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్ జూన్ 6 నుండి బడే మియా చోటే మియా చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. ఈ న్యూస్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫ్యాన్స్ లో కిక్ నింపుతుంది. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ సాహసాలు చూసి ఎంజాయ్ చేయనున్నారు.
బడే మియా చోటే మియా దేశభక్తి చిత్రం అని చెప్పొచ్చు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కింది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. వారి కష్టానికి ఫలితం మాత్రం దక్కలేదు. ఓటీటీలో బడే మియా చోటే మియా చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ నిర్మాతగా ఉన్నాడు.