Cheetahs: మధ్యప్రదేశ్ లోని కూనో జాతియ పార్క్ లో 2022 సెప్టెంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమిబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను వదిలిపెట్టారు.. అయితే కొద్దిరోజులు మన వాతావరణానికి అలవాటు పడేలా ఈ చీతాలను డీప్ ఎన్ క్లోజర్ లో ఉంచారు. ఆ తర్వాత వాటిని మార్చి 11న ఫ్రీ ఎన్ క్లోజర్ లోకి వదిలారు. అయితే వదిలిన 8 చీతాలలో రెండు పారిపోయాయి.. వాటిల్లో ఒకదాని పేరు ఒబాన్, మరొకదాని పేరు ఆశ. ఈ ఆశకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టడం విశేషం.
అయితే ఈ చీతాల మెడలో అటవీశాఖ అధికారులు కోలార్ పరికరాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ పరికరాలు ఇస్తున్న సంకేతాల ఆధారంగా వాటి కదలికలను గమనిస్తున్నారు. ప్రస్తుతం ఆశ అనే చీతా బఫర్ జోన్, రిజర్వ్ జోన్ మధ్య తిరుగుతోంది.. ఇక ఒబాన్ ఇటీవలే ఒక జింకను, ఆవును వేటాడి చంపి తిన్నది. ఒబాన్ మానవ ఆవాసాలకు దగ్గరగా వెళ్తుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కునో నేషనల్ పార్క్ సమీప ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే త్వరలో పారిపోయిన చిరుతల మీద మత్తుమందు ప్రయోగం జరిపి తిరిగి అడవిలో వదిలిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. వాటి మెడలో ఉన్న పరికరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
ఇక 1952లో భారత దేశంలో చీతాలు అంతరించిపోయాయని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇతర దేశాల అడవుల్లో ఉన్న చీతాలను మనదేశంలోకి తీసుకురావాలని అనేక సంప్రదింపులు జరిగాయి. అయితే 2022 సెప్టెంబర్ లో నమిబియా నుంచి ప్రత్యేకమైన విమానంలో 8 చీతాలు మన దేశానికి వచ్చాయి.. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జన్మదినం సందర్భంగా అడవిలోకి వదిలిపెట్టారు. వీటిలో ఒకదాని పేరు ఆశా గా నామకరణం చేశారు. అయితే ఆ ఎనిమిది చీతాలలో ఒబాన్ అనే చీతా తప్పించుకుంది.. దాని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామకరణం చేసిన ఆశ అనే చీతా కూడా తప్పించుకుంది. ప్రస్తుతం వీటిని తిరిగి అడవిలోకి రప్పించేందుకు మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా మధ్యప్రదేశ్ అడవుల్లో నమిబియా చీతాలు అంత సులభంగా మన లేక పోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు..వాటిని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెంచినప్పటికీ ఎందుకు పారిపోతున్నాయో తెలియడం లేదని అటవీ శాఖ అధికారులు వాపోతున్నారు. మత్తుమందు ప్రయోగించి వాటిని మళ్లీ అడవుల్లో ప్రవేశపెడతామని చెబుతున్నారు.