Star Heroes: తెలుగు స్టార్ హీరోలంతా ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టార్ట్ చేసిన బిజినెస్ మల్టీ ఫ్లెక్స్ బిజినెస్. ఏరికోరి ఈ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్చ్.. చివరకు నష్టాల బిజినెస్ కోసం హీరోలు తెగ ఉబలాట పడ్డారు అంటూ కామెడీ అయ్యారు. మహేష్ బాబు ఏ హీరో ఊహకి కూడా అందని సమయంలోనే హైదరాబాద్ లో ‘ఏ.ఎమ్.బి’ పేరుతో మల్టీ ఫ్లెక్స్ నిర్మణంలో భాగం అయ్యాడు.

భాగ్యనగరంలో ‘ఏ.ఎమ్.బి’ మాల్ ఓ ఐకానిక్ థియేటర్ గా మారింది. కానీ ‘ఏ.ఎమ్.బి’ భారీ మల్టీ ఫ్లెక్స్. మెయింటైన్ ఖర్చులు చాలా ఎక్కువ. దాంతో వచ్చే దాని కంటే పోయేదే ఎక్కువగా ఉంది. చివరకు మహేష్ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఇక ‘ఏ.ఎమ్.బి’ తరువాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ స్థలంలో ఓ భారీ మల్టీ ఫ్లెక్స్ మాల్ రెడీ చేస్తున్నారు.
Also Read: రెమ్యూనరేషన్ గురించి క్లారిటి ఇచ్చిన మాస్ మహరాజ్… ఏమన్నాడంటే ?
ఈ నిర్మాణానికి రెడీ అయింది రానా, వెంకటేష్. వీరిద్దరితో పాటు మహేష్ కూడా పెట్టుబడులు పెట్టాడు. దీని పేరు ‘ఎ.ఎమ్.బి విక్టరీ’. మొత్తానికి కరోనా కాలంలో మొదలైన ఇది స్టార్ట్ అవ్వకుండానే నష్టాల మయం అయింది. ఇక విజయ్ దేవరకొండ మంచి బిజినెస్ మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ చేశాడు.
దాంతో పాటు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా దిగాడు. ఏవీడీ (ఆసియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేశాడు. ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఈ హీరో కూడా పాపం నష్టాలనే చవిచూస్తున్నాడు. దిల్ రాజే థియేటర్లు కారణంగా నష్టపోతున్నాం, థియేటర్ల బిజినెస్ వేస్ట్ అని గతంలో చాలాసార్లు తేల్చి చెప్పాడు. అయినా మన హీరోలు పోయి పోయి నష్టాల వలయం లాంటి బిజినెస్ లో పడి నష్టపోతున్నారు.
Also Read: సీనియర్ హీరోయిన్ ప్రేమలో కాంగ్రెస్ నేత కుమారుడు !