https://oktelugu.com/

Reels: రీల్స్ కోసం నడిరోడ్డుపై.. ఈ మహిళ చేసిన పనికి మీరేమంటారు?

కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ టెక్నాలజీని కొందరు వికృత చేష్టలకు ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంలో మొబైల్ ప్రధానంగా నిలుస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2024 / 11:10 AM IST

    Road-side-reels

    Follow us on

    Reels: కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ టెక్నాలజీని కొందరు వికృత చేష్టలకు ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడంలో మొబైల్ ప్రధానంగా నిలుస్తుంది. నేటి కాలంలో మొబైల్ లేనిదే పని ముందుకు సాగడం లేదు. కమ్యూనికేషన్స్ నుంచి మనీ సెండింగ్ వరకు మొబైల్ ప్రధానంగా నిలుస్తుంది. అయితే కొందరు దీనిని దుర్వినియోగం చేస్తూ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మొబైల్ వచ్చాక రీల్స్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ఇది హద్దు పద్దు లేకుండా.. సమయం సందర్భం చూడకుండా.. ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ చేయడానికి ఎంచుకున్న ప్రదేశం పై చాలా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

    టిక్ టాక్ యాప్ బ్యాన్ చేసిన తర్వాత రీల్ చేయడం ఎక్కువైపోయింది. చిన్న పెద్ద లేకుండా.. మహిళలు, యువతులు.. చివరికి వృద్ధులు సైతం రీల్ చేయడంలో ఉత్సాహం చూపుతున్నారు. అయితే కొందరు మెసేజ్ ఇవ్వడానికి రీల్ చేస్తుండగా.. మరికొందరు సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు వీటిని వాడుకుంటున్నారు. ఇంకొందరు ప్రజల్లో గుర్తింపు రావడానికి వికృత టెస్టులకు పాల్పడుతున్నారు. రీల్స్ చేయడానికి జనసంచారం ఉండే ప్రదేశాలను ఉంచుకొని ఎదుటివారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు.

    తాజాగా పంజాబ్ లోని ఓ మహిళ రీల్ చేయడానికి ప్రధాన రహదారిని ఎంచుకుంది. నడిరోడ్డుపై జనసంచారం ఎక్కువగా ఉండగా… ఆ ప్రదేశంలో ఓ కుర్చీ వేసి దానిపై మొబైల్ నుంచి.. ఎదురుగా డాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. అయితే ఓవైపు ప్రధాన రహదారిపై జనం వెళ్తుండగా వారిని పట్టించుకోకుండా ఈమె రీల్స్ చేయడంపై అందరూ ఆసక్తిగా చూశారు. కానీ కొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. రీల్స్ చేయడానికి ప్రధాన రహదారి నీ ఎంచుకోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె పాపులర్ కావడానికి చేసిందా లేక వ్యూస్ కోసం ఇలా చేసిందా అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా కొందరు రీల్స్ మాయలో పడి వెనకా ముందు ఆలోచించకుండా జనసంచారం ప్రదేశంలో వికృత చేష్టలు చేయడం విడ్డూరంగా ఉందని ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

    మరికొందరు ఈ రీల్స్ పై పరిమితులు విధించాలని కోరుతున్నారు. కొందరు రీల్స్ చేయడం వల్ల ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొని ప్రమాదాలను ఎదుర్కొని అవకాశం ఉందని అంటున్నారు. మహిళలు సైతం ఇలాంటి వీల్స్ చేయడం వల్ల యువతకు బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. సమాజానికి ఉపయోగపడే లేదా అవసరానికి మెసేజ్ ఇచ్చే రీల్స్ చేయాలి కానీ ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఎప్పటికైనా నష్టమే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

    కానీ కొందరు మాత్రం సాధారణంగా రీల్ చేయడం వల్ల వ్యూస్ రావని ఇలా చేస్తేనే వ్యూస్ వస్తాయి అని మోజులో పడి మంచి చెడు గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా దూషిస్తున్నారు. ఇలా జనాలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి..