Ram Charan and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసి భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇకమీదట వీళ్లు చేయబోతున్న సినిమాలతో పాన్ ఇండియాలో భారీ విజయాలను కూడా సాధించి పెట్టిన విషయం మనకు తెలిసిందే…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందే. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా వాళ్ళ కాంబినేషన్లో మిస్ అయింది. ఇక ఆ తర్వాత మల్టీ స్టారర్ సినిమా కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ పెట్టి మల్టీ స్టారర్ సినిమా గా ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా మీద రాజమౌళి భారీగా ఫోకస్ అయితే చేసి ఈ సినిమాను తీశాడు. మరి ఇటు నందమూరి, అటు మెగా ఫ్యామిలీ అభిమానులను అలరించడంలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం రోజు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొమరం భీముడో అనే సాంగ్ మీద రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కోరడతో కొట్టినప్పుడు అనుకోకుండా అతనికి ఒక కొరడా దెబ్బ గట్టిగా తగిలిందని వెంటనే రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ ని హగ్ చేసుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ నాకేం తగలలేదు అంటూ నవ్వుతున్నాడు. దాంతో రామ్ చరణ్ కూడా నవ్వాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఇక వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ఈ వీడియోను చూసి మనం తెలుసుకోవచ్చు. అలాంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ ను క్రియేట్ చేసుకున్న వీళ్ళిద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా సాగుతుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలి చూస్తున్నారు.
ఎందుకు అంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్టార్ హీరోలు ఉన్న ఈ రోజుల్లో వీళ్ళు మాత్రం ఈజీగా మంచి సినిమాలను చేసి వాళ్ళ డాన్స్ తో, నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల స్థాయిని పెంచుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టుకున్నారనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు ఇక మీదట చేయబోయే సినిమాల్లో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగాలని ప్రయత్నమైతే చేస్తున్నారు…
Korada NTR Ki Gettiga Tagilindemo Ani Charan Vachi NTR Ni Chesukovadam ❤️❤️.#RRRBehindAndBeyond #RRRMovie pic.twitter.com/VRUyXXzYQE
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) December 27, 2024