https://oktelugu.com/

 Cancer : షాకింగ్.. చీర కట్టుకుంటే క్యాన్సర్ ప్రమాదం

చీరలు ఎక్కువగా ధరిస్తే క్యాన్సర్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులోనూ ఇండియన్స్ కట్టుకునే చీర విధానం వల్ల తప్పకుండా మహిళలు క్యాన్సర్ బారిన పడతారని పరిశోధకులు తెలిపారు. కేవలం ఇండియాలో మాత్రమే చీరను సంప్రదాయంగా భావించి ధరిస్తారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2024 / 10:32 PM IST

    Wearing a saree Cancer

    Follow us on

    Cancer :  భారతీయ సంప్రదాయంలో చీరకు ఒక ప్రాధాన్యత ఉంది. దేశంలో ఏ పండుగ, శుభకార్యం, ఫంక్షన్ ఇలా ఏది జరిగిన కూడా ప్రతీ ఒక్కరూ చీరనే ముందుగా ధరిస్తారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో చీరను కట్టుకునే పద్ధతి మారవచ్చు.. కానీ చీరను మాత్రం తప్పకుండా కట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు అయితే తప్పకుండా చీరనే ధరిస్తారు. ఇప్పుడంటే ట్రెండ్ మారిపోయి చీరలు కాకుండా లెహంగాలు పెళ్లికి ధరిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని దుస్తులు ధరించిన రాని అందం కేవలం ఒక్క చీర కట్టుకుంటే వస్తుంది. ప్రస్తుతం విదేశీయులు కూడా చీరను ధరిస్తున్నారు. ఒక స్త్రీ అందం తాను ధరించే చీరలోనే ఉంటుంది. కొందరు లక్షలు పెట్టి మరి చీరలను కొంటారు. ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా కూడా.. కొత్త చీర చూస్తే చాలు ఇక కొనకుండా ఉండలేరు. ఎంత ఖరీదు అయినా సరే.. నచ్చితే వెంటనే కొనేస్తారు. అయితే ఎక్కువగా చీరలు కట్టే మహిళలకు ప్రమాదకరమైన వ్యాధి వస్తుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. చీరలు ఎక్కువగా ధరిస్తే క్యాన్సర్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులోనూ ఇండియన్స్ కట్టుకునే చీర విధానం వల్ల తప్పకుండా మహిళలు క్యాన్సర్ బారిన పడతారని పరిశోధకులు తెలిపారు. కేవలం ఇండియాలో మాత్రమే చీరను సంప్రదాయంగా భావించి ధరిస్తారు.

    మహిళలు చీర లోపల లంగా ధరించి దానికి ఎటాచ్‌మెంట్‌గా ధరిస్తారు. దీనివల్ల స్క్వామస్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీనినే సారీ క్యాన్సర్ అని అంటారు. గత కొన్నేళ్ల నుంచి ఈ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా వస్తుందని నిపుణులు హెచ్చరించారు. సిటీలో ఉండే మహిళల కంటే గ్రామాల్లో ఉండే మహిళలు శారీని డైలీ కట్టుకుంటారు. వీరు ఏ ఇతర దుస్తులు ధరించకుండా కేవలం శారీని మాత్రమే ధరిస్తుంటారు. ఇలాంటి వారికి తప్పకుండా క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నడుముపై చీరను లోపల లంగాలకు కడుతుంటారు. కొందరు చీర సరిగ్గా ఉండటానికి గట్టిగా కడతారు. దీనివల్ల ఆ స్ధానంలో రాపిడి జరుగుతుంది. దీంతో చర్మ రంగు మారి మచ్చలుగా మారుతాయి. చివరకు క్యాన్సర్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువగా వేడిలో నివసించేవారికి ఈ సారీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మహిళలకు ప్రస్తుతం ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందట. ఇటీవల ఓ 68 ఏళ్ల మహిళ ఈ సారీ క్యాన్సర్ బారిన పడ్డారు. కేవలం ఈ చీరను అనే కాకుండా టైట్ జీన్స్ ధరించిన కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.