wearable AC : ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ తరుణంలో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయమేస్తుంది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూలర్లు, ఏసీలు ఉండే ప్రాంతంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా చల్లదనం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో కొందరు పనులు మానుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఓ పరికరాన్ని మెడకు తగిలించుకొని 50 డిగ్రీల ఎండలోనూ తిరగొచ్చు. SONY కంపెనీ ఓ వినూత్న డివైజ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఎంత ఎండలో ఉన్నా.. చలదనం అందుతుంది. అలాగే శీతాకాలంలో వేడిని అందిస్తుంది. ఈ డివైజ్ గురించి వివరాల్లోకి వెళితే..
వినూత్న గాడ్జెట్స్ ను తీసుకురావడంలో SONY కంపెనీ ముందుంటుంది. ప్రస్తుతం ఉన్న అత్యధిక ఉష్టోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ఒక కొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి Reon Pocket 5 అని పేరు పెట్టారు. సాధారణంగా ఏసీ అనగానే గోడకు తగలించి ఉంటుంది. లేదా ఫోర్టబుల్ ఏసీకి చక్రాలు ఉండడంతో దానిని అటూ ఇటూ తిప్పుకోవచ్చు. కానీ Wearable Acని ఒక వ్యక్తి తన శరీరానికి అమర్చుకోవచ్చు. దీని వల్ల ఎంత ఎండలో వెళ్లినా ఆ వ్యక్తి కూల్ గా ఉంటాడు.
Reon Pocket 5 డివైజ్ ని మెడ వెనుక భాగంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్, డివైజ్ మధ్య ఉన్న సెన్సార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్లూటూత్ ను కనెక్ట్ చేయడం ద్వారా దీని పనితీరు మొదలవుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దానంతట అదే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే ఈ డివైజ్ ను మెడ నుంచి తీసేస్తే పనిచేయడం ఆగిపోతుంది.
2019లో Reon Pocket 5 ని ప్రారంభించారు. కానీ దీనిని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోవడంతో ఇక్కడి వారు కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. Reon Pocket 5 రూ. 16,000లతో విక్రయిస్తున్నారు. దీనికి ఒక్కసారి చార్జింగ్ చేస్తే 17 గంటలు పనిచేస్తుంది. వేసవి కాలంతో పాటు చలికాలంలోనూ ఇది పనిచేస్తుంది. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటే శరీరానికి ఉష్ణోగ్రతను అందించి శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. బయట ఎక్కువగా తిరిగేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.