https://oktelugu.com/

Curd: ఎండాకాలంలో పెరుగు తింటున్నారా?

పెరుగును వేసవిలో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. పెరుగు రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. దీనివల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయట కూడా. వాస్తవానికి పెరుగులో ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 5, 2024 / 09:56 AM IST

    Curd:

    Follow us on

    Curd: పాలు పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. ఇక ఎండాకాలంలో కాస్త ఛాయ్ ను స్కిప్ చేసినా పెరుగు లేకుండా భోజనం కంప్లీట్ చేయరు కొందరు. ఎన్ని సార్లు భోజనం చేసినా సరే, ఎంత రుచి కరమైన భోజనం చేసినా సరే చివరికి పెరుగు అన్నం ఉండాల్సిందే అంటారు. ఒక ముద్దు అయినా తింటారు. మరి ఎండాకాలంలో పెరుగు తినవచ్చా? తింటే ఏమైనా ప్రయోజనాలు పొందవచ్చా లేదా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    పెరుగును వేసవిలో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. పెరుగు రోజు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. దీనివల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయట కూడా. వాస్తవానికి పెరుగులో ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ఈ పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది. వేసవిలో మరీ ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పుల్లటి పెరుగు తింటే శరీరం చల్లగా అవుతుందట.

    దీర్ఘకాలంగా పెప్టిక్ అల్సర్ సమస్యలతో బాధపడుతున్న వారు రోజు పెరుగు తింటే శాశ్వతంగా సమస్య దూరం అవుతుందట. ఈ పెరుగు శరీరాన్ని డీ-టాక్సీ చేయడానికి కూడా సహాయం చేస్తుంది. శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలిగిపోతాయి. అయితే పుల్లటి పెరుగుతో ఎండు ద్రాక్షను కలిపి ఎండాకాలంలో తీసుకుంటే అనేకమైన ప్రయోజనాలు పొందవచ్చట. ఇలా తీసుకోవడం వల్ల పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుందట. కొందరు పెరుగును డైరెక్ట్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారు మజ్జిక చేసుకొని తాగిన ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు.