
రాష్ట్రంలో భాజపా చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఆరే మైసమ్మ ఆలయం క్రాస్ రోడ్స్ ను చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే.. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగిస్తామన్నారు. భూములను ఆక్రమించుకుని కొందరు నిజాం ఆస్తులుగా ప్రచారం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎం పార్టీతో తెరాసకు ఉన్న రహస్య ఒప్పందమేంటని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.