Telugu News » Ap » Krishnashtami celebrations in glory in thirumala
Thirumala: తిరుమలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
తిరుమలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా గోగర్భం వద్ద కాళీయమర్దనుడికి అర్చకులు అభిషేకం చేశారు. గోగర్భం వద్ద యువకులు ఉట్టి కొట్టారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్వహించిన గోకులాష్టమి గోపూజా కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డితో కలిసి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం గోమాత, దూడకు నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.