Chiranjeevi-Balakrishna : #RRR చిత్రానికి ఒక చరిత్ర ఉంటే, అందులోని నాటు నాటు పాటకు మరో ప్రత్యేకమైన చరిత్ర ఉంది అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) లాంటి దేశం లోనే అత్యుత్తమ డ్యాన్సర్లు కలిసి ఒక మంచి మాస్ బీట్ కి డ్యాన్స్ వేస్తే ఎలాంటి అద్భుతాలు జరగాలని మనం ఆశిస్తామో, ఈ పాటకు అంతకు మించిన అద్భుతాలే జరిగాయి. కేవలం మన దేశంలోనే పాపులర్ అవ్వడం కాదు, ప్రపంచం మొత్తం వీళ్లిద్దరి డ్యాన్స్ కి ఊగిపోయింది. ఆస్కార్ అవార్డు ని తెచ్చి మన టాలీవుడ్ చేతిలో పెట్టేలా చేసింది. అలాంటి పాటకు ఈ తరం రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ వేశారు సరే, ఎన్నో ఏళ్ళ నుండి బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడిన చిరంజీవి, బాలకృష్ణ కలిసి డ్యాన్స్ వేస్తే చూడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు.
Also Read : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ!
రీసెంట్ గానే ఎన్టీఆర్, రామ్ చరణ్ లండన్ లోని ఆల్బర్ట్ హాల్ లో జరిగిన #RRR లైవ్ షోకి ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ షో మొదలయ్యే ముందు జరిగిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘నాటు నాటు పాటు మా బాబాయ్ బాలకృష్ణ(Nandamuri Balakrishna), చిరంజీవి(Megastar Chiranjeevi) గారు కలిసి చేస్తే చూడాలి అనేది నా కోరిక’ అంటూ చెప్పుకొచ్చాడు. ఏ ముహూర్తాన ఎన్టీఆర్ నుండి ఆ మాట వచ్చిందో కానీ, నిజంగానే ఆ అద్భుతమైన సంఘటన అతి త్వరలోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అతి త్వరలోనే ఆహా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా ‘అన్ స్టాపబుల్’ సీజన్ 5 మొదలు కాబోతుందట. ఈ సీజన్ లోని మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టు తెలుస్తుంది.
గత సీజన్ లోనే చిరంజీవి కోసం ప్రయత్నం చేశారు కానీ, ఎందుకో కుదర్లేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి ఎపిసోడ్ మెగాస్టార్ తోనే చెయ్యాలని ఫిక్స్ అయిపోయారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యినట్టు తెలుస్తుంది. ఆగష్టు నెలలో ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ చేస్తారని, ఈ ఎపిసోడ్ లో ఒక మూమెంట్ లో చిరంజీవి, బాలకృష్ణ కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయబోతున్నారని టాక్. అందుకు తగ్గ కాన్సెప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారట. నాలుగు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ ‘అన్ స్టాపబుల్’ షో దేశం లోనే నెంబర్ 1 టాక్ షో గా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా నందమూరి బాలకృష్ణ ని యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. స్టార్ హీరోలలో కేవలం ఎన్టీఆర్ తో తప్ప అందరితో ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఇక తన సమకాలీన హీరోలలో చిరంజీవి, నాగార్జున మిగిలి ఉన్నారు. ఈ సీజన్ తో వాళ్ళను కూడా కవర్ చేస్తారట.
Also Read : ఈడీ విచారణకు మహేష్ బాబు మళ్ళీ డుమ్మా కొట్టాడా..? ఈసారి కారణం ఏమిటంటే!