Viral Video : ఇన్ స్టాగ్రామ్ లో ఒక సాంగ్ బాగా రీచ్ వెళ్లాలంటే అంత తేలికైన విషయం కాదు. దర్శక నిర్మాతలు కూడా ఇన్ స్టాగ్రామ్ లో తమ సాంగ్ ని అత్యధిక శాతం మంది రీల్స్ చేస్తే, సినిమాకు బాగా కలిసి వస్తుందని బలంగా నమ్ముతున్నారు. కేవలం ఇన్ స్టాగ్రామ్ లో భారీ స్థాయిలో రీల్స్ రావాలని కొంతమంది కొరియోగ్రాఫర్స్ స్పెషల్ గా స్టెప్పులు కంపోజ్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోండి. కొంతమంది అయితే డబ్బులిచ్చి మరీ రీల్స్ చేయిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది మరీ. అలాంటి చోట రీసెంట్ గా ‘అన్నన్న పాథియే'(Annana Pathiya) అనే పాట సెన్సేషన్ సృష్టించింది. ఇన్ స్టాగ్రామ్ వాల్ ని తెరిచి చూస్తే దీనికి సంబంధించిన రీల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో వైరల్ అయిపోయింది ఈ పాట. ఇంతకీ ఈ పాట ఎక్కడి నుండి వచ్చింది?, దీని విశేషాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
Also Read : పడుకున్న గుర్రంపై వరుడు? ఇదేందయ్య ఇదీ..వైరల్ వీడియో
అన్నన్న పాథియే అనేది ఒక థాయ్ పదం. థాయ్ ల్యాండ్ దేశం లోని ప్రజలు ఒక వ్యక్తిపై చూపించే ప్రేమని ఇలాంటి పదాలతో ఉపయోగించి పాటలు పాడుతుంటారు. ఈ పదాన్ని తొలిసారిగా ‘టోంగ్ బ్రావో క్రాహ్మోం’ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఉపయోగించారు. ఒక ప్రియుడు తన ప్రేయసి కి ప్రేమని వ్యక్తం చేసే క్రమం లో ఈ పాదాలను ఉపయోగించి, కాస్త హాస్యం జోడించి, జనరంజకంగా ఉండేలా ట్యూన్ ని తయారు చేసి ఈ పాటని పాడారు. థాయ్ ల్యాండ్ దేశంలో ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో 2010 వ సంవత్సరం లో తెరకెక్కిన ‘ది హోలీ మ్యాన్ 3’ అనే సినిమా కోసం ఉపయోగించారు. దాంతో ఏ పాట మరింత వైరల్ అయ్యింది. అయితే ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం విడుదలైన పాట వింతగా ఇప్పుడు ప్రత్యేకించి ట్రెండ్ అవ్వడం ఏమిటి అని మీకు సందేహం రావొచ్చు.
అక్కడికే వస్తున్నాం..రీసెంట్ గా ఈ పాటను ఇండోనేషియా దేశానికీ చెందిన నీకెన్ సలింద్రి అనే యువ గాయని ఒక స్టేజి షో మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం తో ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. చిన్నతనం నుండి నీకెన్ కి సంగీతం మీద అమితాసక్తి ఉంది. ఆమె తండ్రికి కూడా సంగీతం అంటే విపరీతమైన ఇష్టం ఉండడంతో ఇద్దరు కలిసి అనేక స్టేజి షోస్ ప్రదర్శించడం మొదలు పెట్టారు . రీసెంట్ గానే ఈమె ఈ పాటకు హుక్ స్టెప్ ని క్రియేట్ చేసి డ్యాన్స్ వేసింది. ఇది సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో, అందరూ ఆ హుక్ స్టెప్ ని అనుసరించి రీల్స్ చేయడం మొదలు పెట్టారు. అలా ఈ పాట ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ని ఒక ఊపు ఊపేస్తోంది
https://www.youtube.com/watch?v=a2cX9DD0alQ
Also Read : పూరన్.. బంతి తలపగలగొట్టినా.. ఇంత పిచ్చేంట్రా బాబూ! వైరల్ వీడియో