spot_img
HomeNewsఆమెతో డేటింగ్.. దాని గురించి ఇప్పుడెందుకు ?

ఆమెతో డేటింగ్.. దాని గురించి ఇప్పుడెందుకు ?

Vikas Guptaదివంగత నటి, ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్‌ ‘ప్రత్యూష బెనర్జీ’ జీవితంలో ఎంతో డ్రామా ఉంది. అయితే ఆమె గురించి తాజాగా ఓ నిర్మాత చేసిన కామెంట్స్ ఆమె సన్నిహితులను తీవ్రంగా బాధ పెడుతుంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అంటే.. ‘వికాస్‌ గుప్తా’. వికాస్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్రత్యూష బెనర్జీ ప్రేమించుకున్నామని చెప్పుకొచ్చాడు.

అయితే, ప్రత్యూష బెనర్జీకి నేను అంటే ఎంతో ప్రేమ. బహుశా ఆ ప్రేమే నాకు ఆమెను దూరం చేసింది. కానీ ఆ దూరానికి కారణం మాత్రం నా గురించి ఎవరో చెడుగా ప్రత్యూష బెనర్జీకి చెప్పారు. అది ఆమె నమ్మేసింది. ఆ విషయంలో మా ఇద్దరికీ కొన్ని సార్లు గొడవలు జరిగాయి. ఇక మా రిలేషన్ ను కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

చివరకు మా ఇద్దరికీ బ్రేకప్‌ అయింది అంటూ తాజా ఇంటర్వ్యూలో వికాస్ వివరించాడు. పైగా తనకు ప్రత్యూష దూరం అయినప్పుడు ఆమె మీద నాకు విపరీతమైన కోపం పెంచుకున్నాను. దాంతోనే ఆమె బయట ఎక్కడైనా కనిపించినా, నేను చూపు తిప్పుకొని ఆమెవరో తెలియనట్లే వెళ్లి పోయేవాడిని. అయితే, ఆమెంటే నాకెంతో ఇష్టం. అందుకే తనతో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్‌ చేయాలనుకున్నాను.

ఇక తాను బైసెక్సువల్‌ అన్న విషయం ఆమె నేను విడిపోయాకే తెలిసింది అంటూ వికాస్ చాలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే, నిర్మాత వికాస్ గుప్తా కామెంట్స్ పై ప్రత్యూష క్లోజ్‌ ఫ్రెండ్‌, హిందీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కామ్య పంజాబీ సీరియస్ అయ్యారు. ‘వికాస్ గుప్తా అసలు చెప్పింది నిజమా ? అబద్దమా ? అన్నది ఒక్క ప్రత్యూషకి మాత్రమే తెలుసు.

కానీ, దాని గురించి మాట్లాడటానికి ప్రత్యూష ఇప్పుడు మన మధ్య లేదు. ఈ లోకంలో లేని వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను వికాస్‌ ఇప్పుడెందుకు పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద చెబుతున్నాడు ? ప్రత్యూషతో ఉన్న అనుబంధం గురించి వికాస్ మాట్లాడకుండా ఉండాలి. బహుశా అతను ఫేమస్‌ కావడానికి ఈ కామెంట్స్ చేస్తున్నాడేమో. ఇలాంటి వాటిని నేను అస్సలు మెచ్చుకోను’ అంటూ కామ్య చెప్పుకొచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version