https://oktelugu.com/

Veg vs Non-veg: ఆరోగ్యానికి శాఖహారమా? మాంసహారమా? రెండింట్లో ఏది బెటర్!

నాన్ వెజ్ కంటే వెజ్ ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటే.. మరికొందరు మాత్రం నాన్‌వెజ్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇదే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. మరి ఆరోగ్యానికి శాఖాహారం మంచిదా? లేకపోతే మాంసాహారం మంచిదా? అనేది తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2024 / 05:56 PM IST

    Eating Non Veg

    Follow us on

    Veg vs Non-veg: మనం ఆరోగ్యంగా ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించిది తీసుకునే ఆహారమే. ప్రతీ ఒక్కరు వాళ్ల లైఫ్‌లో వారు తీసుకునే రోజూవారీ అలవాట్లు, తీసుకునే ఆహారం, వ్యాయామం, యోగా వంటివి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. పోషకాలు లేని ఆహారం, మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఎక్కువ శాతం మందికి వెజ్ కంటే నాన్‌వెజ్ అంటేనే ఇష్టం. రోజూ నాన్‌వెజ్ వండిపెడితే వద్దని అనకుండా ఇష్టంగా తింటారు. ఒక్కపూట వెజ్ తినమంటే తినరు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, చికెన్ అంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఏ సమయంలో ఇచ్చిన నో చెప్పకుండా తినేస్తారు. చాలామందికి చికెన్ బిర్యానీ, నాన్‌వెజ్ అంటే ఒక ఏమోషన్ అని చెప్పవచ్చు. అయితే నాన్ వెజ్ కంటే వెజ్ ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటే.. మరికొందరు మాత్రం నాన్‌వెజ్‌లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇదే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. మరి ఆరోగ్యానికి శాఖాహారం మంచిదా? లేకపోతే మాంసాహారం మంచిదా? అనేది తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    ఆరోగ్యానికి మంసాహారం కంటే శాఖాహారం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా కూరగాయలు వల్ల ఆరోగ్యం నిలకడగా ఉంటుందని, పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. రోజూ తాజా కూరగాయలతో చేసిన వంటలు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నాన్‌వెజ్ తినేవాళ్లతో పోలిస్తే వెజ్ వాళ్లు ఆరోగ్యంగా ఉంటారని, అనే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శాఖాహారం తినే వ్యక్తుల్లో 75 శాతం గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. శాకాహారం తినడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను సులభంగా నియంత్రించవచ్చు. అనేక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఫైబర్ వంటివి కూడా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శాఖాహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు, కీడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మొక్కల ఆధారితంగా వచ్చిన ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటును కూడా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.

     

    నాన్‌వెజ్ తింటే తొందరగా బరువు పెరిగి ఊబకాయం వచ్చేస్తుంట. శాకాహారంలో ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందట. నాన్ వెజ్‌లో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా కొవ్వు ఉంటుంది. దీని వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మాంసాహారం కంటే శాఖాహారంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. వెజ్‌ ఆహారంలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, ఐరన్, విటమిన్ సి, ఎ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శాఖాహారం వల్ల కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను నిరోధించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.