Prasanth Varma: స్టార్ హీరోలు ప్రశాంత్ వర్మ మీద ఎందుకు ఫోకస్ చేయడం లేదు…

సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను సాధించిన వాళ్లకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ లో సినిమా చేసి భారీ సక్సెస్ ని సాధించిన దర్శకులకైతే చాలా మంచి క్రేజ్ దక్కుతుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 14, 2024 5:55 pm

Prasanth Varma

Follow us on

Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ముఖ్యంగా ప్రశాంత్ వర్మ యూనివర్స్ కింద ఎక్కువ సినిమాలను చేయడానికి ఆయన చాలా ఎక్కువ సన్నాహాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మంచి సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో మిగతా దర్శకులతో కూడా సినిమాలను చేయిస్తూ వాళ్లకి కూడా సరైన ప్రోత్సాహాన్ని అందిస్తూ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్ వర్మ కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయినప్పటికీ తనకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు అయితే రావడం లేదు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఎవరు ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం ఏదైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ను ఇండస్ట్రీలో ఉంచుకొని ఆయనతో సినిమా చేయలేకపోవడం అనేది నిజంగా మన స్టార్ హీరోల దురదృష్టమనే చెప్పాలి.

హనుమాన్ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారాడు. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమనేది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక రికార్డు అనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ను అండర్ రేటెడ్ డైరెక్టర్ గా గుర్తించి మన స్టార్ హీరోలు అవకాశాలిస్తే ఆయన ఇంకా అద్భుతాలను క్రియేట్ చేస్తాడు. ఇక ప్రస్తుతం ఆయన జై హనుమాన్ అనే సినిమాని తెరకెక్కిస్తూనే బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా ఎత్తుకున్నాడు. మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.

అలాగే బాలయ్య బాబు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది కూడా చూడాలి… ప్రశాంత్ వర్మ స్టార్ హీరోల నుంచి అవకాశాలు రాకపోయిన తను ఎక్కడా ఖాళీ లేకుండా వరుస సినిమాను లైన్ లో పెడుతున్నాడు…