https://oktelugu.com/

Ugadi : ఉగాది పచ్చడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీనిని ఎందుకు తీసుకోవాలి?

Ugadi : తెలుగువారి మొదటి పండుగ ఉగాది. క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో శాతవాహనుల కాలంలో ఉగాది పండుగ ప్రారంభమైంది. యుగం అంటే సంవత్సరం.. ఆది అంటే మొదలు..

Written By: , Updated On : March 25, 2025 / 10:32 AM IST
Ugadi

Ugadi

Follow us on

Ugadi : తెలుగువారి మొదటి పండుగ ఉగాది. క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో శాతవాహనుల కాలంలో ఉగాది పండుగ ప్రారంభమైంది. యుగం అంటే సంవత్సరం.. ఆది అంటే మొదలు.. ఉగాది అంటే సంవత్సరం ప్రారంభం. అందువల్ల సంవత్సరం మొదటి రోజున ఉగాది పండుగను నిర్వహిస్తున్నారు. ఉగాది పండుగ అనగానే కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటినుంచి వసంత రుతువు ప్రారంభమైనందున ప్రకృతి రమణీయంగా ఉంటుంది. స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది. అలాగే చెట్లు చిగురిస్తాయి. కొత్త పూలు వస్తాయి. ఉగాది సందర్భంగా ముందుగా గుర్తుకు వచ్చేది పచ్చడి. ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడిని తయారుచేసి కుటుంబ సభ్యులంతా సేవిస్తారు.. అలాగే కొన్ని సంస్థల ఆధ్వర్యంలో పచ్చడిని తయారు చేసి పంపిణీ చేస్తారు. అసలు ఉగాది రోజున ఈ పచ్చడిని ఎందుకు తయారు చేస్తారు? దీని వెనుక ఉన్న అర్థం ఏంటి?

ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు కలుస్తాయి. వీటిలో తీపి, చేదు, వగరు, పులుపు, లవణం, కారం.. వీటన్నిటినీ కలిపి పచ్చడిని తయారు చేస్తారు. తీపి కోసం బెల్లం ను, చేదు కోసం వేప పువ్వును, వగరు కోసం మామిడి కాయను, పులుపు కోసం చింత పండును, లవణం కోసం ఉప్పును, కారం కోసం కారంపొడిని కలిపి పచ్చడని తయారు చేస్తారు. అయితే ఈ ఐదు రకాల పచ్చడి కేవలం సాంప్రదాయమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉగాది సందర్భంగా కొత్త వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి వాతావరణమైనా తట్టుకోవడానికి ఉండే విధంగా ఈ రుచులు అన్నింటిని కలిపిన పచ్చడిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారని పూర్వకాలంలో నిర్ణయించారు. అప్పటినుంచి ఉగాది పచ్చడిని సేవిస్తూ వస్తున్నారు. ఉగాది పచ్చడి సేవించడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల రుచులు శరీరానికి అందించడం వల్ల కావలసిన ఖనిజాలు అందుతాయి.

Also Read : కాదేదీ మీమ్స్ కు అనర్హం.. చివరికి రాశి ఫలాలను కూడా వదిలిపెట్టడం లేదు..

ఈ ఆరు రుచులు కేవలం ఆరోగ్యకరమే కాకుండా.. ఏడాది పాటు ఉండే జీవితం గురించి కూడా తెలుపుతాయి. వీటిలో కారం దుఃఖాన్ని, తీపి సంతోషాన్ని, చేదు బాధను తెలుపుతుంది. అంటే భవిష్యత్తులో ఇలాంటి బాధలు వస్తే వాటిని తట్టుకోవాల్సి ఉంటుందని తెలిపేందుకే ఈ ఆరు రకాల రుచులను సేవించాలని తెలుపుతారు. ఇవి సేవించడం వల్ల పడే బాధలు భవిష్యత్తులో ఎదుర్కొనే కష్టాలను గుర్తు చేస్తాయని తెలుపుతున్నారు. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం వల్ల భవిష్యత్తులో జరిగే పరిస్థితి గురించి ముందే తెలుసుకుంటారు.

అయితే ఈరోజు ఆరు రుచులు కలిగిన పచ్చడి మాత్రమే కాకుండా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత నుంచి తట్టుకునేందుకు అనువైన పిండివంటలు చేస్తారు. కొత్తగా పనులు ప్రారంభించే వారు ఈ రోజు నుంచే మొదలు పెడతారు. తెలుగు సంవత్సరం ప్రకారం చైత్రమాసం మొదటి నెల అయితే.. పాల్గొనమాసం చివరి మాసం. అందువల్ల ఏడాది ప్రారంభంన పనులు ప్రారంభించాలని అనుకుంటారు.

Also Read : తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక.. అసలు కథ ఏమిటో తెలుసా..