https://oktelugu.com/

Upcoming Cars : కొత్త ఎస్‎యూవీ కొనాలని చూస్తున్నారా..అయితే త్వరలో రాబోతున్న ఫ్యామిలీ కార్లు ఇవే

Upcoming Cars : మీరు మీ మొత్తం కుటుంబం కోసం కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. కొద్ది రోజులు ఆగండి. ఎలక్ట్రిక్ నుంచి SUVలకు కొత్త కార్లను సెలక్ట్ చేసుకోవచ్చు.

Written By: , Updated On : March 25, 2025 / 10:42 AM IST
Upcoming Cars

Upcoming Cars

Follow us on

Upcoming Cars : మీరు మీ మొత్తం కుటుంబం కోసం కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. కొద్ది రోజులు ఆగండి. ఎలక్ట్రిక్ నుంచి SUVలకు కొత్త కార్లను సెలక్ట్ చేసుకోవచ్చు. కొద్ది రోజులు ఆగితే బడ్జెట్లోనే బెస్ట్ ఫ్యామిలీ కారును కొనుగోలు చేయగలుగుతారు. భారతీయ మార్కెట్‌లో త్వరలో చాలా కార్లు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఒక మోడల్ చాలా చౌకగా ఉండబోతోంది.భారతీయ మార్కెట్‌లో SUV సెగ్మెంట్‌తో పాటు, పెద్ద కార్లలో MPV సెగ్మెంట్ కూడా చాలా పాపులర్ అయింది. సాధారణంగా 6, 7 సీట్ల ఆఫ్షన్లలో వచ్చే ఈ కార్లు ‘ఫ్యామిలీ కార్లు’గా పాపులర్. కియా, రెనాల్ట్, ఎంజీ ఎంపీవీ కార్లు త్వరలో దేశంలోకి రానున్నాయి.

Also Read : వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్న పవర్ ఫుల్ కార్లు ఇవే !

కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్
మీడియా నివేదికల ప్రకారం.. కియా ఇండియా ఎంపీవీ కియా కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది విడుదల కానుంది. ఇది ఇంకా కన్ఫాం కాలేదు. అయితే ఇది రోడ్లపై తరచూ టెస్టింగ్ సమయంలో కనిపిస్తూనే ఉంది. ADAS, బెస్ట్ ఇంటీరియర్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు కంపెనీ పాత కేరెన్స్‌ను కూడా విక్రయిస్తూనే ఉంటుంది. ఈ కారు స్పెషల్ వేరియంట్ ను కంపెనీ విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ మోడల్స్
ఇటీవల మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ప్రస్తుత SUVలైన మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌లైన మారుతి eVitara, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌లను కూడా రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో కియా ఇండియా తన ఎంపీవీ కియా కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారులో కంపెనీ 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ ను అందించవచ్చు.

రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ
కియా కేరెన్స్ రెండు వేర్వేరు వెర్షన్‌లు రాబోతున్నాయని వాటికి పోటీగా రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా ఈ ఏడాది రావొచ్చు. 7-సీట్ల ఎంపీవీ సెగ్మెంట్‌లో ఇది ప్రస్తుతం దేశంలోని చౌకైన కార్లలో ఒకటి. దీనిని రోడ్లపై కూడా ఇప్పటికే టెస్ట్ చేశారు. దీని ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అనేక కాస్మెటిక్ మార్పులు ఉండవచ్చు. దీని బేస్ మోడల్ ధర ప్రస్తుతం రూ. 6.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఎంజీ ఫ్యామిలీ కార్
బ్రిటిష్ కార్ బ్రాండ్ ఎంజీ ప్రస్తుతం భారతదేశంలో ఎంపీవీ సెగ్మెంట్ కారును విక్రయించడం లేదు. ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో తన కొత్త కారును విడుదల చేయడానికి రెడీ అవుతుంది. జనవరి 2025లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఎంజీ M9 ఎంపీవీని ప్రదర్శించింది. ఇది త్వరలో భారతీయ మార్కెట్లోకి త్వరలోనే తీసుకురావచ్చు.

Also Read : వచ్చే నెలలో లాంచ్ కానున్న పవర్ ఫుల్ కార్లు.. వాటి ఫీచర్లు, ధర తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే ?

kia