కరోనాతో గిరిజన తెగలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని జాతీయ మావన హక్కుల సంఘం ఆందోళన వ్యక్త చేసింది. వీరిలో 50 వేల లోపు జనాభా ఉన్న తెగల్లోని వారందరికీ 60 రోజుల్లో కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సిఫార్సు చేసింది. దేశంలో 177 గిరిజన జిల్లాల్లో 705 గిరిజన తెగలు ఉండగా అందులో లక్షలోపు జనాభాతో 75 తెగలు అంతరించే ముప్పును ఎదుర్కొంటున్నాయని గుర్తుచేసింది. ఈ తెగల్లో కరోనా మరింతగా వ్యాపిస్తే వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుందంటూ హెచ్చరించింది.