
కరోనా కారణంగా ఈ నెల 14న జరిగే జాతీయ ప్రవేశ స్ర్కీనింగ్ పరీక్ష నెస్ట్ దరఖాస్తు గడువును జూలై 15 వరకు పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 14 న జరగాల్సిన పరీక్ష ప్రస్తుతం వాయిదా పడింది. పరీక్షను వాయిదా వేయడంతో పాటు దరఖాస్తు దాఖలు తేదీని జూలై 15 వరకు పొడిగించారు. అంతకుముందు దరఖాస్తు దాఖలుకు చివరి తేదీ జూన్ 7 గా ఉండేది. ప్రస్తుతం పరీక్ష తేదీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు.