
Actress Khushbu: సీనియర్ హీరోయిన్ కుష్బూకి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. గత వారం రిలీజ్ అయిన పెద్దన్న సినిమాలోనూ కుష్బూ తన పాత్రతో అదరగొట్టింది. వయసు అయిపోయినా.. తనలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి ఘనంగా చాటుకుంది. అందుకే, ప్రస్తుతం కుష్బూకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇప్పుడు ఆమె ఖాతాలో మరో సినిమా పడింది. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో మహేష్ కి అత్త పాత్రలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది. అలాగే హీరో వరుణ్ తేజ్ కొత్తగా కమిట్ అయిన సినిమాలోనూ కుష్బూ(Actress Khushbu) నటిస్తోంది. మొత్తమ్మీద కుష్బూకి వరుస తెలుగు సినిమాలు వస్తున్నాయి. అందుకే, ఈ మధ్య తన ఫిజిక్ కూడా తగ్గించింది. స్లిమ్ గా మారి పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది.
సినిమా ఛాన్స్ లు పెరిగినంత మాత్రానా ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా ? యంగ్ హీరోయిన్ లా ఇంత కష్టం దేనికమ్మా అంటే.. తగ్గేదే లేదు అంటుంది. అవకాశం రావాలే గానీ, ఇప్పుడు కూడా తానూ గ్లామర్ రోల్స్ లో నటించడానికి రెడీ అంటూ మేకర్స్ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది. కుష్బూ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆర్ధికంగా ఆమె కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అని అందుకే మళ్లీ సినిమాల ఫోకస్ పెట్టిందని అంటున్నారు.
మేకర్స్ కూడా కుష్బూ ఉత్సాహాన్ని చూసి ఆమె కోసం కొన్ని పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు వైవిధ్యమైన శృంగార భరిత కథలలో నటించి మెప్పించిన కుష్బూ చేత.. మళ్ళీ అలాంటి తరహా పాత్రలు చేయిస్తే. తమిళ నాట యూత్ ఎగబడి చూస్తారు అని తమిళ మేకర్స్ ఆలోచిస్తున్నారు. కాబట్టి… కుష్బూ నుంచి త్వరలోనే బోల్డ్ క్యారెక్టర్స్ ను ఆశించవచ్చు,
పైగా ప్రస్తుతం ఆంటీ, తల్లి పాత్రలలో తనదైన శైలిలో కుష్బూ దూసుకుపోగలదు. నిజానికి ఆమె ‘అల వైకుంఠపురంలో’ తల్లి పాత్రలో కనిపించాల్సింది. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర మిస్ అయింది. అందుకే త్రివిక్రమ్ ఆమెకు మహేష్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడు.