AR Rehman: ఆ హీరో సినిమాకు పని చేయడం చాలా కష్టంగా ఉండేది- రెహ్మాన్​

AR Rehman: కొన్ని వేల పాటలకు సంగీతం అందించి.. స్టార్​ హీరోలకు సూపర్​ డూపర్​ ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్​ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్​. ఈయన ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం. ఉంది. ఈ క్రమంలోనే రజనీకాంత్​తో కలిసి అనేక సినిమాల్లో  పనిచేశారు.  రజనీకాంత్ నటించిన  ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0 సినిమాలకు రెహ్మాన్​ సంగీతం అందించారు. అయితే, తాజాగా, రజనీతో కలిసి పని చేసిన అనుభవంపై […]

Written By: Raghava Rao Gara, Updated On : November 11, 2021 6:01 pm
Follow us on

AR Rehman: కొన్ని వేల పాటలకు సంగీతం అందించి.. స్టార్​ హీరోలకు సూపర్​ డూపర్​ ఆల్బమ్స్ అందించిన మ్యూజిక్​ డైరక్టర్ ఏఆర్ రెహ్మాన్​. ఈయన ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం. ఉంది. ఈ క్రమంలోనే రజనీకాంత్​తో కలిసి అనేక సినిమాల్లో  పనిచేశారు.  రజనీకాంత్ నటించిన  ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0 సినిమాలకు రెహ్మాన్​ సంగీతం అందించారు. అయితే, తాజాగా, రజనీతో కలిసి పని చేసిన అనుభవంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెహ్మాన్​.

స్టార్​హీరోల ఇమేజ్​కు తగ్గట్లు ట్యూన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎంతో ఒత్తిడి మ్యూజిక్​ డైరెక్టర్స్​పై ఉంటుంది. రెహ్మాన్ కూడా రజనీకాంత్​ చిత్రాలకు పనిచేయడం ఎంతో కష్టమని అన్నారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహ్మాన్.. పరిమితమైన సమయం ఉండటం వల్ల.. భారం పెరిగి రజనీ సినిమాలకు ట్యూన్స్ అందించిన అనుభవం తనకు ఉందని అన్నారు. ఇప్పుడన్నా చాలా నయమని.. అప్పట్లో రజనీకాంత్​ సినిమాలు తరచూ దీపావళి రోజు విడుదలవుతూ ఉండేవని అన్నారు. అందుకు తోడు, తాము ఉంటున్న ఏరియాలో కరెంట్ కోత ఉండటం వల్ల.. జనరేటర్లు ఉన్నా నరకంగా ఉండేదని అన్నారు.

రజనీకి ఉన్న ఇమేజ్​ కారణంగా ట్యూన్స్​ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వచ్చేదని అన్నారు. దాంతో నేను పని చేసే ఇతర దర్శకులు ఆగ్రహానికి బలైన సందర్భాలూ ఉన్నాయని అన్నారు. కాగా, రెహ్మాన్​ ఆరు జాతీయ అవార్డులతో పాటు, రెండూ అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.