Megastar Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో పవర్‌స్టార్… తగ్గేదే లే అంటున్న అభిమానులు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 తో తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఒకే తెరపై ఇద్దరు హీరోలు కనిపిస్తే… ఆ మూవీ ప్రేక్షకులకు డబుల్ ధమాకా లాంటిదే. ఒకవేళ ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీ నుండి అయితే… అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలి లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 11, 2021 5:51 pm
Follow us on

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 తో తనలోని సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఒకే తెరపై ఇద్దరు హీరోలు కనిపిస్తే… ఆ మూవీ ప్రేక్షకులకు డబుల్ ధమాకా లాంటిదే. ఒకవేళ ఆ ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీ నుండి అయితే… అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలి లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఎలాంటి సినిమాలు తీస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారో అలాంటివే ఎంచుకుంటూ ముందు కెళ్తున్నారు.

ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ‘భీమ్లా నాయక్’ నుండి వస్తున్న వరుస అప్డేట్స్ అభిమానులకు ట్రీట్ ఇస్తున్నాయి. భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయిన తర్వాత మిగతా సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నాడు పవన్. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి 154 చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే విడుదల అయ్యింది. ప్రీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మరొక హీరోకు కూడా స్కోప్ ఉండేలా కథ రాసుకున్నాడట బాబీ.

ఈ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు టాక్. మెగాస్టార్, పవన్ స్టార్‌ను ఒకే స్క్రీన్‌పై చూడాలని ఎంతోమంది మెగా అభిమానుల కోరిక. వీరిద్దరి సినీ కెరీర్‌లో వీరు కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా… పవన్ కళ్యాణ్ క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్‌లో అలరించారు. కానీ బాబీ సినిమాలో అలా కాకుండా ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.