HomeNewsToday horoscope in telugu 14.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు...

Today horoscope in telugu 14.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు ధనమే ధనం.. పట్టిందల్లా బంగారమే..

‘Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు త్రిగ్రహి కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి నిరుద్యోగులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదో నెలలు వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతోంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాలు పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కంపెనీల నుంచి శుభవార్తలు అంది అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉంటాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు త్రిగ్రహి కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. తెలివైన పనులు చేయడంతో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉండనున్నాయి. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు అధికారంలో నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని సవాలను పూర్తి చేయాల్సి వస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. కొందరు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారే వ్యక్తిగత జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు ప్రత్యేక వ్యక్తులు కలవడం వల్ల వారి వ్యాపార అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని లాభాలే ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పిల్లల కెరీర్ విషయంలో తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే గురువుల మద్దతు తీసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు విని అవకాశం ఉంది. ఉన్నతాధికారుల అండదండలతో ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular