Emergency : నేటి కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించని పరిస్థితి ఉంది. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తారో లేదో అనే భయం చాలామందిలో నెలకొంది. ఈ క్రమంలో కొంతమంది సేఫ్టీగా ఉండేందుకు రకరకాల మార్గాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే బయట ఎక్కడైనా.. రోడ్డుపై అనుకోకుండా పడిపోతే ఎవరైనా సేవ్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అయితే బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ మొబైల్ లో సెక్యూరిటీగా పాస్వర్డ్ ను పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో లాక్ తో సంబంధం లేకుండా ఒక నెంబర్ను సేవ్ చేసుకోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..
ఆపద సమయంలో ఆదుకునే వారు అందుబాటులో ఉన్నా.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం కోసం మొబైల్ నే ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే మొబైల్ సెక్యూరిటీ పాస్వర్డ్ తో కలిగి ఉండడం వల్ల ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉండదు. అంతేకాకుండా ఆ సమయంలో బాధితుడు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎమర్జెన్సీ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఈ నెంబర్లో కుటుంబ సభ్యుల్లో ఎవరిది అయినా పర్వాలేదు. అయితే ఫోన్ కు ఎలాంటి లాక్ ఉన్న ఈ నెంబర్కు కాల్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ ను ముందే మార్చుకోవాలి. ఇందుకోసం ఇలా చేయాలి..
Also Read : నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ అంటే ఏమిటి.. అమెరికాలో అలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తింది?
మొబైల్ లోని Settings లోకి వెళ్ళాలి. ఇక్కడ Password and Security అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ safety emergency అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు add contact అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీకు సంబంధించిన అమ్మ, నాన్న, భార్య లేదా తమ్ముడు ఇలా దగ్గరి రిలేషన్స్ ఎవరైనా కాంటాక్ట్ ను యాడ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకున్న ఫోన్ నెంబరు ఎమర్జెన్సీ సమయంలో ఫోన్ కు లాక్ ఉన్నా కూడా కాల్ వెళ్తుంది. అప్పుడు ఇతరులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఉంటుంది. అయితే ఈ ఆప్షన్లో ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
రోడ్డుమీద వెళ్లేటప్పుడు మనకు లేదా ఇతరులకు ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనిని మీరు ఏర్పాటు చేసుకొని ఇతరులకు కూడా చెప్పి అందుబాటులో ఉండే నెంబర్ను సేవ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రమాదాల సమయంలో ఇతరుల కంటే కుటుంబ సభ్యుల సహాయం ఎక్కువగా అవసరం ఉంటుంది. అందువల్ల వారు త్వరగా సంఘటన స్థలానికి రావాలంటే ఇలాంటి ఎమర్జెన్సీ నెంబర్ తప్పక సేవ్ చేసుకోవాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒకే నెంబర్ను మాత్రమే సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ముఖ్యమైన వ్యక్తుల నెంబర్లు మాత్రమే సేవ్ చేసుకోవాలి. అందులోనూ ఎమర్జెన్సీ సమయంలో స్పందించే వారిదే ఉండాలి.
Also Read : ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భారత విమానం పాక్ లో ల్యాండింగ్ చేయవచ్చా.. రూల్స్ ఏంటో తెలుసా ?