card : కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలిపింది. అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే గత కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతలకోసం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని కారణాలతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, సబ్సిడీలు రైతులకు రావడం లేదని గ్రహించింది కేంద్రం. ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా.. దేశంలోని రైతులందరికీ ఆధార్ తరహా గుర్తింపు కార్డులను అందించడానికి ముందుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఒక రాష్ట్రం, కొందరు రైతులు మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా నిర్ణయం తీసుకుంది. అందుకే ఆధార్ మాదిరి రైతులకు మరో గుర్తింపు కార్డులను జారీ చేయాలని ప్లాన్ చేస్తుంది. వీటి ద్వారా ద్వారా రైతులు పథకాల సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాదు ఇతర లావాదేవీలు కూడా సులభం అవుతాయని తెలిపారు.
అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రిజిస్ట్రీలో రైతుల వివరాలు సేకరిస్తారు. వాటిని డిజిటల్‌గా భద్రపరుస్తారు. దీనికి దేశంలోని 19 రాష్ట్రాలు అంగీకారం కూడా తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీంతో ఈ పనులు త్వరలోనే ప్రారంభం చేయబోతున్నారు అధికారులు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్వహణ యూనిట్ ఏర్పాటు చేయడానికి బి.గోపి నేతృత్వంలో కమిటీని నియమించారు. ఈ యూనిట్ రైతుల సమాచారం సేకరిస్తుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి అమలు చేయనుంది ఈ కమిటీ. అయితే రాష్ట్రంలో పలు పథకాలు రైతులకు సక్రమంగా అందడం లేదని గుర్తించింది కేంద్రం ప్రభుత్వం. అందుకే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయాలని చూస్తుంది. ఈ కార్డులను పంటల మద్దతు ధర విధానం, పశుసంపద డేటా, పథకాల అనుసంధానం వంటి వాటికి వినియోగిస్తారు.
ఇక 2024-25 బడ్జెట్‌లో వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం కేంద్రం రూ.2,817 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. రైతుల వివరాలు, భూముల వివరాలతో పాటు పంటలు, పశుసంపద వంటి సమగ్ర సమాచారాన్ని పూర్తిగా తీసుకొని డేటాబేస్ రూపొందించాలనే ప్లాన్ లో కూడా ఉందట కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం భూములు, పంటల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రిజిస్ట్రీ ద్వారా రైతుల వ్యక్తిగత సమాచారం, పంటల వివరాలు పూర్తిగా కేంద్రానికి చేరుతాయి అనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు పథకాల ప్రయోజనాలు తెలుస్తాయని.. అంతేకాదు వారికి పూర్తిగా, త్వరగా అందుతాయని కూడా అనుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు కూడా ఇది ఉపయోగకరంగా మారనుందట.