Heroine : ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించడం అంత సులభం కాదు. హీరోయిన్ గా రాణించాలని ఎంతో మంది పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రల్లో చేసి ఇప్పుడు హీరోయిన్ రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ యంగ్ బ్యూటీ ఒకరు. ఎటువంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ చేసిన నటి ఇప్పుడు హీరోయిన్ గా రూ. 300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. 2014 లో విడుదలైన ఈ చిత్రంలో అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన సివిల్ ఇంజనీర్ గా కనిపిస్తారు. ఈ పాత్రకు సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. అయితే సోనాక్షి సిన్హా పక్కన ఉండే అమ్మాయి పాత్రలో ఈ హీరోయిన్ కనిపించింది.
లింగ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఆమె ఎవరో కాదు. యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్. 2012లో అమృత పరిశ్రమలో అడుగు పెట్టింది. 2016 వరకు కూడా ఆమె పలు తమిళ సినిమాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేని పాత్రలు చేసింది. పడైవీరన్ చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. ఇక విజిల్ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు వచ్చాయి. ‘ రెడ్ ‘ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘ 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా ‘ సినిమాలో నటించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక అమృత కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ లో అమృత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 360 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసిన అమృత అయ్యర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానం