
నారా చంద్రబాబు నాయుడు హయంలో 15వేల టీచర్ ఉద్యోగాలు, 2 విడతల్లో 6,748 పోలీస్ నియామకాలు జరిగాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అప్పడు ప్రతిపక్ష నేతగా ఉన్నజగన్ పాదయాత్ర చేసినప్పుడు లక్షల పోస్టులు ఇస్తామంటూ హామీ ఇచ్చారని, ఇప్పడు 10 వేలతో సరిపెడుతున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ముంచారన్నారు.